https://oktelugu.com/

Actress Trisha: ఎమోషనల్ ట్వీట్ చేసిన నటి త్రిష… గుండె బద్దలైందంటూ పోస్ట్

Actress Trisha: తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్‌ త్రిష. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది త్రిష. తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ఈ భామ… ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. ఇటీవల తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతితో తమిళంలో ‘96’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 15, 2021 / 07:58 PM IST
    Follow us on

    Actress Trisha: తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్‌ త్రిష. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది త్రిష. తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ఈ భామ… ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. ఇటీవల తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతితో తమిళంలో ‘96’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌  స్టార్ట్‌ చేసిన త్రిష ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై మొగ్గుచూపుతుంది. 

    అయితే కొంత కాలంగా  టాలీవుడ్‏లో త్రిషకు అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెట్టింది. అక్కడే వరుస సినిమాలను చేస్తూ…తనేంటో నిరూపించుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‏గా ఉండే త్రిష… అభిమానులకు టచ్ లో ఉంటూ ఉంటుంది. అయితే తాజాగా తన గుండె బద్దలైందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది త్రిష. ఇటీవల త్రిష వీరాభిమాని కిషోర్ మరణించాడు.  త్రిష అభిమానులందరినీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక్కచోటికి తీసుకువచ్చాడంట. అలాంటి వ్యక్తి చనిపోవడంతో త్రిష అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న త్రిష కూడా అభిమాని మరణంతో కంటతడి పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న త్రిష…  నా గుండె బద్దలైంది, నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను బ్రదర్ అంటూ ఎమోషనల్ ట్విట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.