Actress Rachitha Ram: సినిమా ప్రెస్‌మీట్‌లో నోరు జారడం కారణంగా ఓ నటి వివాదాల్లో చిక్కుకుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి రచిత రామ్ సినిమా “లవ్ యూ రచ్చు” టీజర్ ఇటీవల రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ తరుణంలో టీజర్ గురించి ప్రశ్నించిన విలేకరితో నేరుగా భార్యభర్తల మధ్య ఉండే రొమాన్స్ బయటకు చూపించాం. అందులో తప్పేంటి అనే నేరుగా అడిగేసింది నటి రచిత రామ్. ‘బోల్డ్ కంటెంట్‌తో ఉన్న సినిమాలో నటించడానికి కారణం ఏమిటి ?’’ అని ప్రశ్నించిన రిపోర్టరుతో… ‘ఇక్కడ ఉన్న వాళ్లంతా పెళ్లైన వాళ్లే అనుకుంటున్నా అని చెప్పారు.
కాగా ఇందులో సిగ్గు పడటానికి ఏం లేదు. సాధారణంగా అడుగుతున్నా పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తారు. రొమాన్సే చేస్తారు కదా. అదే సినిమాలో చూపించాం. ఆ సీన్స్ వెనుక ఒక కారణం ఉంది. సినిమా చూస్తే అది అర్థం అవుతుంది. మీకు పిల్లలు పుట్టేశారా చెప్పండి’ అంటూ కామెంట్స్ చేసి నవ్వేసింది. రచిత వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కన్నడ కాంతి దల్ ఆమెపై విరుచుకుపడింది. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆమెను వెంటనే బహిష్కరించాలని సూచించింది. ఈమెపై సోషల్ మీడియా లో కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రచిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.