David Warner: డేవిడ్ వార్నర్: ఈ మీమ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పరువు తీస్తున్న నెటిజన్లు

David Warner: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు.కావాల్సింది నమ్మకం.. అది లేకనే ఇప్పుడు మన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ బాధపడుతోంది. నమ్మకం పెట్టుకోక అవమానించిన పాపానికి అనుభవిస్తోంది.  ఐపీఎల్ వరకూ ఒక లెక్క.. ఐపీఎల్ తర్వాత మరో లెక్క.. ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు.. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీరు చూశాక ఎస్ఆర్.హెచ్ మేనేజ్ మెంట్ ఖచ్చితంగా పునరాలోచనలో పడి ఉంటుంది. […]

Written By: NARESH, Updated On : November 15, 2021 7:44 pm
Follow us on

David Warner: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు.కావాల్సింది నమ్మకం.. అది లేకనే ఇప్పుడు మన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ బాధపడుతోంది. నమ్మకం పెట్టుకోక అవమానించిన పాపానికి అనుభవిస్తోంది.  ఐపీఎల్ వరకూ ఒక లెక్క.. ఐపీఎల్ తర్వాత మరో లెక్క.. ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు.. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీరు చూశాక ఎస్ఆర్.హెచ్ మేనేజ్ మెంట్ ఖచ్చితంగా పునరాలోచనలో పడి ఉంటుంది. ఎందుకంటే అంతలా మన డేవిడ్ భాయ్ రెచ్చిపోయాడు మరీ..

david warner memes

మొన్నటి ఐపీఎల్ లో.. అంతకుముందు డేవిడ్ వార్నర్ ఫాం కోల్పోయి పరుగులు చేయలేక సున్నాలకే ఔట్ అయిపోయాడు. అతడు వరుసగా విఫలం కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ ఏకంగా కెప్టెన్సీ నుంచి తొలగించి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయంసన్ కు పగ్గాలు అప్పగించింది. అంతటితో ఊరుకుందా.. డేవిడ్ వార్నర్ ను జట్టులోంచి తీసేసి ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ను ఆడించింది.

ఈ ఘోర అవమానానికి మనస్థాపం చెందిన డేవిడ్ వార్నర్ తాను సన్ రైజర్స్ ను వీడుతున్నట్టు వచ్చే ఐపీఎల్ మేగా వేలంలోకి రాబోతున్నట్టు చూచాయగా చెప్పుకొచ్చాడు. ఇక ఆరెంజ్ ఆర్మీతో తన బంధం కొనసాగదని హింట్ ఇచ్చాడు.

ఇక ఫాం కోల్పోయి.. డేవిడ్ వార్నర్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో డేవిడ్ భాయ్ రెచ్చిపోయాడు. వార్నప్ మ్యాచ్ లలోనూ ఆడలేకపోయిన వార్నర్ పై సన్ రైజర్స్ ఆశలు వదిలేసుకున్నా ఆస్ట్రేలియా క్రికెట్ టీం మాత్రం నమ్మకం ఉంచింది. అతడికి అవకాశాలు ఇచ్చింది.

ఇప్పుడు డేవిడ్ వార్నర్ పై నమ్మకం ఉంచిన ఆస్ట్రేలియా అద్భుతాన్ని సాధించింది. అతడు తొలి మ్యాచ్ నుంచి ఫామ్ అందుకొని వరుసగా ఆఫ్ సెంచరీలు కొట్టి ఏకంగా ఆస్ట్రేలియాకు కప్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. డేవిడ్ వార్నర్ కే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కిందంటే అతగు ఎంతలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు.

ఇలా సన్ రైజర్స్ నమ్మకుండా కాలదన్ని అవమానించిన డేవిడ్ వార్నర్ పరిస్థితి ఇప్పుడు మారింది. ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపి అతడు సత్తా చాటాడు. ఇప్పుడు ఫాం అందుకున్న వార్నర్ సన్ రైజర్స్ తో కొనసాగుతాడా? లేదా తనను అవమానించిన జట్టును వదిలేసి షాక్ ఇస్తాడా? అన్నది చూడాలి. అయినా చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అనుభవించాల్సిందే..