Actress Samantha ప్రస్తుతం నేటి తరం అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తూ విజయం సాధిస్తున్నారనే చెప్పాలి. వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లు గానే కాకుండా దర్శకులుగా, నిర్మాతలుగా రాణిస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం మన తెలుగు హీరోయిన్లలో నిర్మాతగా రాణిస్తున్న వారిని వేళ్ళ మీదే లెక్కబెట్టొచ్చు. వీరిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, మెగా డాటర్ నిహారిక ఉన్నారు. ఇటీవలే కాజల్ “మను చరిత్ర” అనే సినిమాను తెరకెక్కిస్తుండగా… నిహరిక ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తుంది. ఇప్పుడే వీరి బాటలోనే ప్రముఖ నటి తాప్సీ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ గా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ… నిర్మాణ రంగం వైపు అడుగులు వేయనుందని తెలుస్తుంది. ఇటీవల ‘అవుట్ సైడర్స్ ఫిలిమ్మ్స్’ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది తాప్సీ. స్వంతంగా సినిమాల్ని తెరకెక్కించడానికి ఈమె సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా సమంతతో ఓ ప్రాజెక్టు చేయబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. వీరి కాంబోలో హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రాబోతుంది. వారి మధ్య డీల్ ఓకే అయితే… సమంత చేసే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.
మరోవైపు చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సమంత తన సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాతువాక్కుల రెండు కాదల్` సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. అలాగే తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.