Gellu Srinivas Yadav: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ప్రతి రౌండ్ లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోంది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూరు హిమ్మత్ నగర్ లో కూడా ఆయనకు పెద్ద షాక్ తగిలింది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మెజార్టీ సాధించారు. 191 ఓట్ల మెజార్టీ పొంది శ్రీనివాస్ యాదవ్ కు నష్టమే కలిగించారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హిమ్మత్ నగర్ లో 358 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రజలు ఈటల రాజేందర్ వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎన్ని పాచికలు వేసినా చివరికి మాత్రం ఈటలకే మొగ్గు చూపడం తెలుస్తోంది. దళితబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినా టీఆర్ఎస్ కు లాభం లేకుండా పోయింది.
Also Read: ‘ట్రెండింగ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’.. సినిమా గురించి కాదండోయ్!
హుజురాబాద్ లో తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5105 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నారు. దీంతో అధికార పార్టీ ఎంత ప్రచారం చేసినా అవి ఫలితం చూపలేకపోయినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఓటరు మాత్రం సానుభూతికే పెద్దపీట వేసినట్లు సమాచారం. దీంతో హుజురాబాద్ లో అధికార పార్టీ అంచనాలు తలకిందులవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
Also Read: Huzurabad bypoll results: వీణవంకపైనే టీఆర్ఎస్ బోలెడు ఆశలు.. అక్కడ పోతే హుజూరాబాద్ పోయినట్టే??