శృతి హాసన్ అంటేనే బోల్డ్.. మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదు. ఎలాంటి బూతు వ్యవహారం అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం శృతికి మేకప్ తోనే అబ్బింది. బోల్డ్ హీరోయిన్స్ చాలామంది ఉండొచ్చు. కానీ శృతి హాసన్ లాంటి హీరోయిన్ బహు అరుదు. తరుచుగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తూ.. ఆ విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించడం అంటే అది శృతికి మాత్రమే సాధ్యం అనుకోవాలి.
శృతి హాసన్ ఇంతే ఏ విషయాన్ని దాచిపెట్టదు. ఒకప్పుడు తానూ పెద్ద తాగుబోతుని అని ఏ అమ్మాయి మాత్రం చెప్పగలదు, అలాగే తన మిగిలిన అలవాట్లు గురించి కూడా శృతి హాసన్ డైరెక్ట్ గానే బయటపెట్టింది. తాజాగా శృతి మరో సీక్రెట్ రివీల్ చేసింది. పైగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో బెడ్ లో కూర్చొని మరి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ఈ చాట్ సెషన్ నిర్వహించింది.
అభిమానులతో జరిపిన ఈ ముచ్చట్లు కార్యక్రమంలో ఒక అభిమాని నీ బాడీలో మీకు మీ ముక్కు ఇష్టమేనా అంటూ ఓ చెత్త ప్రశ్న వేశాడు. అయితే అలాంటి చెత్త ప్రశ్నకు కూడా శృతి సమాధానం చెబుతూ….’ఓ ఎస్. బాగా ఇష్టం. ఎందుకంటే నా బాడీలో నేను ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ పార్ట్ కే కదా’ అంటూ సిగ్గు పడుతూ తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతి చెప్పుకొచ్చింది.
శృతి హాసన్ తన ముక్కుకి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. నిజానికి శృతి హాసన్ ముఖంలో ముక్కే కొంచెం తేడా. అందుకే ఆమె కెరీర్ కొత్తలో ఆమె ముక్కు పై అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఇక ఆ కామెంట్స్ భరించలేక ముక్కుకు సర్జరీ చేయించుకొంది. అయితే ఆ సర్జరీ సరిగ్గా సెట్ కాలేదు. సన్నిహితులు కూడా ఆమెను ఆ విషయంలో హేళన చేశారు. దాంతో మళ్ళీ బోలెడు డబ్బు పోసి లండన్ వెళ్లి మరీ మళ్ళీ సర్జరీ చేయించుకొంది.