https://oktelugu.com/

Abhishek Sharma: ఈసారి వన్ డౌన్ లో.. టీ 20 ల్లో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్.. మెరుపు సెంచరీ తో సరికొత్త రికార్డు..

హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ గా ఆడి సరికొత్త రికార్డులు సృష్టించిన అభిషేక్ శర్మ.. క్లబ్ మ్యాచ్ లో వన్ డౌన్ బ్యాటర్ గా మైదానం లోకి వచ్చాడు. 26 బంతుల్లో 103 పరుగులు చేశాడు.. ఇందులో 14 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 8, 2024 / 03:17 PM IST

    Abhishek Sharma

    Follow us on

    Abhishek Sharma: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ తరఫున అద్భుతంగా ఆడిన ఈ యువ సంచలనం.. ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా అదే లయను కొనసాగిస్తున్నాడు. గుర్గావ్ వేదికగా జరిగిన క్లబ్ మ్యాచ్ లో మెరుపు వేగంతో శతకం కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే మూడు అంకెల స్కోర్ సాధించాడు.

    హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ గా ఆడి సరికొత్త రికార్డులు సృష్టించిన అభిషేక్ శర్మ.. క్లబ్ మ్యాచ్ లో వన్ డౌన్ బ్యాటర్ గా మైదానం లోకి వచ్చాడు. 26 బంతుల్లో 103 పరుగులు చేశాడు.. ఇందులో 14 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్ల పై ఏమాత్రం కనికరం లేకుండా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 396 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. వాస్తవానికి ఇది అధికారిక మ్యాచ్ కాకపోయినప్పటికీ.. అభిషేక్ శర్మ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి, త్వరలోనే ఆయన టీమిండియాలో చోటు దక్కించుకుంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ఐపీఎల్ హైదరాబాద్ జట్టులో ఈ సీజన్లో చేరిన అభిషేక్ శర్మ.. అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి మైదానంలో పరుగుల వరద పారించాడు. మైదానంలో కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ ప్రత్యర్థి జట్లకు కోలుకోలేని నష్టాన్ని చేకూర్చి వెళ్లాడు.. అభిషేక్ బ్యాటింగ్ వల్ల హైదరాబాద్ జట్టు ఢిల్లీపై పవర్ ప్లేలో 125 పరుగులు చేసి.. సరికొత్త రికార్డు సృష్టించింది.

    ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ముంబై, బెంగళూరు పై 250+ పరుగులు చేయడంలో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్ మాత్రమే కాదు బంతితోనూ అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు ఉపయోగపడ్డాడు. ఈ స్థాయిలో ఆడుతున్నాడు కాబట్టి అభిషేక్ శర్మకు టి20 లలో చోటు కల్పించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. టి20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే, శ్రీలంక సిరీస్ లలో అభిషేక్ శర్మ చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ఐపీఎల్ -24 సీజన్ లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్లలో 484 రన్స్ చేశాడు.