Ritu Chaudhary : సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి రీతూ చౌదరి అంటే ఎవరో తెలియకుండా ఉండదు. ఇంస్టాగ్రామ్ లో ఈమె ఒక సెన్సేషన్. తనకి సంబంధించిన హాట్ ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈమెకు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించిన ఈమె, అనేక టీవీ సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి బుల్లితెర ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైంది. ఈమె అభిమానులు బిగ్ బాస్ షోలో ఈమెని చూస్తామని అనుకున్నారు. కానీ ఆమెకి అవకాశం వచ్చినా వెళ్ళలేదు, ఆమె బదులుగా స్నేహితురాలు విష్ణు ప్రియ వెళ్ళింది. బిగ్ బాస్ షో కి వచ్చి ఉండుంటే ఈమెకి సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చేవి. అంత అందంగా ఉంటుంది ఈమె. అయితే ఈమె ఇప్పుడు 700 కోట్ల రూపాయిల స్కామ్ లో చిక్కుకున్నట్టు మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ లోని ఇబ్రహీం పట్నం ని కేంద్రం గా చేసుకొని 700 కోట్ల రూపాయిలను ఒక ముఠా కొట్టేసిందని, అమాయకులను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి వాళ్ళ నుండి బలవంతంగా సంతకాలు పెట్టించుకుని భూములను కబ్జా చేసారని సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ సీఎం చంద్ర బాబు కి నేడు ఫిర్యాదు చేసాడు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్, అతని ప్రేయసి రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే అక్రమంగా దోచి వేయబడిన ల్యాండ్స్ అని తేలింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. ఈమె ప్రస్తుతం శ్రీకాంత్ తో కలిసి లేదు అని తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె పేరు కూడా ఈ స్కామ్ లో ఉండడం గమనించాల్సిన విషయం.
మీడియా మొత్తం సెన్సేషనల్ గా మారిన ఈ అంశం పై రీతూ చౌదరి స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడిప్పుడే కెరీర్ లో దూసుకెళ్తున్న సమయంలో రీతూ చౌదరి ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవడం ఆమె కెరీర్ పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే కచ్చితంగా రీతూ చౌదరి విచారణకు రావాల్సిందే. వరుసగా సినీ నటులు అరెస్ట్ అవుతున్న ఈ నేపథ్యం లో రీతూ చౌదరి వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తనపై వచ్చే ప్రతీ రూమర్స్ కి స్పందించే అలవాటు ఉన్న రీతూ చౌదరి, ఈ అంశంపై కూడా స్పందిస్తే ఆమెకు ఇందులో ఎలాంటి సంబంధం లేనట్టు. ఒకవేళ స్పందించకుండా మౌనంగా ఉంటే, ఈ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.