https://oktelugu.com/

Pragathi: చీరలో ప్రగతి జిమ్ చూస్తే చుక్కలు చూడాల్సిందే.. వైరల్ వీడియో

సినిమాల్లో తక్కువగా కనిపించినా ప్రగతి నిత్యం వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాదా వ్యాఖ్యలు చేసి ఆమె పాపులర్ అయింది. ఇటీవల ఆమె రెండో పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 1, 2023 / 10:19 AM IST

    Pragathi

    Follow us on

    Pragathi: సోషల్ మీడియా వచ్చాక కొందరు సినీ సెలబ్రెటీలు సినిమాల్లో కంటే బయటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. తమ పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కొంత మందిని రియల్ లైఫ్ లో చూసి షాక్ అవుతున్నారు. వెండితెరపై ఎంతో సాంప్రదాయంగా కనిపించిన వారు బయట చాలా రష్ గా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రగతి ఒకరు. సహాయ నటిగా ఎన్నో పాత్రల్లో నటించిన ఆమె స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రగతి రియల్ లైఫ్ లో విభిన్నంగా కనిపిస్తూ.. పర్సనల్ విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. తాజాగా ఓ వీడియోను చూసి కండల వీరులు షాక్ అవుతున్నారు.. ఎందుకంటే?

    సినిమాల్లో తక్కువగా కనిపించినా ప్రగతి నిత్యం వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాదా వ్యాఖ్యలు చేసి ఆమె పాపులర్ అయింది. ఇటీవల ఆమె రెండో పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. వాటిపై ప్రగతి సీరియస్ అయింది. తనకు అలాంటి ఆలోచన లేదని, తనను సంప్రదించకుండా అలాంటి వార్తలు ఎలా ప్రచురిస్తారని సోషల్ మీడియాలో ఓ వీడియోనుషేర్ చేయడం సంచలనంగా మారింది.

    ఇలాంటి సమయంలో ప్రగతికి సంబంధించిన లేటేస్ట్ వీడియో ఆకట్టుకుంటుంది. ఆమె జిమ్ సెంటర్లో వర్కౌట్ చేస్తూ ఈ వీడియోలో కనిపించింది. అయితే సాదాసీదాగా కాకుండా ఏకంగా 90 కిలోల బరువులు ఎత్తారు. అంతేకాకుండా చీర కట్టుకొని మరీ ఈ బరువులు ఎత్తడంపై వీక్షకులు షాక్ అవుతున్నారు. సాధారణంగా వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రత్యేక డ్రెస్ వేసుకుంటారు. కానీ ప్రగతి అందరి దృష్టిని ఆకర్షించేందుకు చీరలో 90 కిలోల బరువులు ఎత్తడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

    ప్రగతికి సంబంధించిన వర్కౌట్ వీడియోలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆమె ఏకంగా 90 కిలోల బరువు ఎత్తడంపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. తనపై ఇటీవల వచ్చిన వార్తలకు కౌంటర్ గానే.. ఈ వీడియోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. మానసికంగా తాను ఎంతో ఫిట్ అని చెప్పడానికే ఇలా చేసిందని కొందరు అంటున్నారు.గతంలోనూ ప్రగతి కఠిన వ్యాయామాలు చేసిన వీడియోలు షేర్ చేసింది. కానీ ఏజ్ ఎక్కువైనా ఇంత పెద్ద మొత్తంలో బరువులు ఎత్తడంపై సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.