Baladitya: బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఫేక్, గెలవాలంటే అదే ముఖ్యం… మాజీ కంటెస్టెంట్ బాలాదిత్య సెన్సేషనల్ కామెంట్స్!

బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్నాడు. తన ప్రవర్తనతో ఒక మంచి వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బాలాదిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Written By: NARESH, Updated On : November 1, 2023 10:03 am

Baladitya

Follow us on

Baladitya: టాలీవుడ్ నటుడు బాలాదిత్య గురించి పరిచయం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమాలు,సీరియల్స్ తో అటు వెండి తెర ప్రేక్షకులకు ఇటు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గతంలో మా ఊరి పొలిమేర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలాదిత్య. ప్రస్తుతం ఈ ఏడాదిలో మా ఊరి పొలిమేర -2 రాబోతుంది. బాలాదిత్య తో పాటు సత్యం రాజేష్,గెటప్ శ్రీను,కామాక్షి భాస్కర్ల,అక్షత ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకులను అలరించనుంది.

బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్నాడు. తన ప్రవర్తనతో ఒక మంచి వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బాలాదిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలాదిత్య మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిలో అంబటి అర్జున్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అతను జిమ్ మేట్స్. అర్జున్ బాగా స్మార్ట్ గా ఆడుతున్నాడు.

బిగ్ బాస్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ రియాలిటీ షో అనేది ఓ గేమ్. ఇందులో కొందరు జెన్యూన్ గా కనిపిస్తారు. కొందరు ఫేక్ గానే అనిపిస్తారు. మనం బిగ్ బాస్ హౌస్ లో ఎంత తెలివిగా ఆడుతున్నాం అనేది మనకు ముఖ్యం అని చెప్పారు బాలాదిత్య. పల్లవి ప్రశాంత్ ,రతిక గురించి తెలుసు. హౌస్ లో మన పర్ఫామెన్స్ మాత్రమే ఆడియన్స్ చూస్తారు. నువ్వు ఎంత లాజికల్ గా ఆడుతున్నావ్ అనేది ప్రేక్షకులు గుర్తిస్తారు. వైల్డ్ కార్డు ద్వారా ఐదు వారాలు బయట ఆట చూసి వచ్చిన వారికి కాస్త అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు మీరు ఎంత బాగా ఆడుతున్నారు అన్నదే చాలా ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు బాలాదిత్య.

బాలాదిత్య సీజన్ 6లో పాల్గొన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలా కూల్ గా మాట్లాడేవాడు బాలాదిత్య. అయితే నాగార్జున తరచుగా చివాట్లు పెట్టేవాడు. సిగరెట్ల కోసం బాలాదిత్య గీతూ మీద ఫైర్ అయ్యాడు. 10వ వారం బాలాదిత్య ఇంటిని వీడాడు. ఆ సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు.