Actress suicide: సినీ రంగుల లోకంలో ఏదో ఊహించుకొని వచ్చిందామే.. నటిగా ఏలాలనుకుంది.కానీ బంధాలు ఆమెను బంధీ చేశాయి. ఆ కబంధ హస్తాల్లో నలిగి ఆమె ప్రాణాలే పోయాయి. ప్రేమ.. లివ్ న్ రిలేషన్ షిప్ లో చిక్కుకొని ఓ నటి ప్రాణాలు పోయాయి.

బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో సంచలనమైంది. కోల్ కతాలోని గార్ఫా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆమెది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు.

నటి పల్లవి మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే పల్లవి ప్రస్తుత ప్రేమలో ఉందని.. ఆమె ఒకరితో కలిసి సహజీవనం చేస్తోందని విచారణలో తేలింది. ఈ మేరకు ఆమె బాయ్ ఫ్రెండ్ ను గార్ఫా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ బెంగాలీ టీవీ నటి గౌరీగా ‘మోన్ మనే నా’ లో పల్లవి ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రేషమ్ జాపి, సరస్వతి ప్రేమ్, అమీ సిరాజేర్ బేగంషోల్లో మెరిసింది.
Recommended Videos



[…] Also Read: Actress Suicide: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి… […]
[…] Also Read: Actress Suicide: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి… […]