Actress Mehreen: కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరోయిన్ మెహ్రీన్. రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి చిత్రాలతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన మూవీ “మంచి రోజులు వచ్చాయి” సినిమా ఈ దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ మారాకు ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెహ్రీన్.
కాగా మారుతి డైరెక్షన్ లో ఇది తన రెండో సినిమా అని… మారుతి స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఈ కథ వినకుండా ఓకే చేశాను అని చెప్పారు. నా జీవితంలో కథ వినకుండా చేసిన ఏకైక చిత్రం “మంచి రోజులు వచ్చాయి” అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర పేరు పద్మ అని… ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కనిపిస్తాను అని అన్నారు. తనను ప్రాణంగా ప్రేమించే తండ్రి, తను ఇష్టపడే అబ్బాయి మధ్య ఒక అమ్మాయి అనుభవించే సంఘర్షణ శైలిలో కథ సాగుతుంది అని చెప్పారు.
ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ లో డైరెక్టర్ మారుతి గారు ఈ కథను వివరించారు. రెండో దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తొలిదశలో భయపడుతూ షూటింగ్ చేశాం సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా శోభన్ నేను పనిచేశాం అని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షక అభిమానులందరికీ నచ్చుతుందని తెలిపారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారట… అలానే బయోపిక్ సినిమాలో అవకాశం వస్తే వదులుకోను అని వివరించింది మెహ్రీన్. నా దృష్టిలో పెద్ద, చిన్న సినిమాలు అనే వ్యత్యాసం ఉండదని… కథనే నమ్ముతాను అని, తన పాత్ర ముఖ్యం అని వివరించింది. మరో రెండు సినిమాలు కొత్తగా అంగీకరించగా… కన్నడలో ఓ చిత్రం చేస్తున్నట్లు మెహ్రీన్ తెలియజేశారు.