Bangarraju Movie: ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీ ప్రొఫెషనల్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉందనే చెప్పాలి. ఇటీవలే నాగచైతన్య “లవ్ స్టోరీ”… అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ” చిత్రాలతో సూపర్ హిట్ లను అందుకున్నారు. అదే ఫామ్ లో కొత్త ప్రాజెక్ట్ లలో కూడా బిజీగా దూసుకుపోతున్నారు ఈ అక్కినేని యువ హీరోలు. అయితే ఈ ఏడాది వీళ్ళ తండ్రి నాగార్జునకు సూపర్ హిట్ లేదనే చెప్పాలి. అందుకనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలా అయిన సూపర్ హిట్ అందుకోవాలని భావిస్తున్నారంట నాగార్జున.

సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి ప్రీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “బంగార్రాజు” చిత్రంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. వీరికి జోడిగా రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో నాగార్జున మరోసారి ఘోస్ట్ రోల్ చేయనున్నారుట. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
నాగ్ , చైతు ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంలో తాతా-మనవళ్లు గా నాగ్ – చై నటిస్తున్నారని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులని నవ్వుల్లో ముంచేలా ఉంటాయట. “సోగ్గాడే చిన్నినాయన”లో కొడుకు పాత్ర చేసిన నాగ్… కొడుకుగా ‘బంగార్రాజు’ లో నాగచైతన్య నటిస్తున్నారు. రెండో భాగంగా లో కొడుకు నాగార్జున కనిపించరట. మనవడి ప్రేమని సక్సెస్ చేయడానికి ఘోస్ట్ అయిన తాత రంగంలోకి దిగుతారని టాక్ నడుస్తుంది. మనవడు ప్రేమించిన అమ్మాయిగా కృతి శెట్టి నటిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో నాగచైతన్య పేరు కూడా బంగార్రాజే అని తెలుస్తుంది.