https://oktelugu.com/

AP Bjp: వైసీపీ సర్కార్ పై సోము వీర్రాజు ‘ఒక్క ఛాన్స్’ యుద్ధం

AP Bjp: ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ‘ఒక్క ఛాన్స్’ యుద్ధాన్ని మొదలుపెట్టారు. వైఎస్ జగన్ 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే అస్త్రంగా మలిచి వైసీపీ సర్కార్ పై సోమువీర్రాజు పోరు షురూ చేశారు. జగన్ ఒక్క చాన్స్ తో ఏపీ ఇల్లు గుల్ల చేశాడని ఆరోపిస్తున్నారు. సోము వీర్రాజు తాజాగా లాజిక్ ప్రశ్నలు బయటకు తీశాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2021 / 05:51 PM IST
    Follow us on

    AP Bjp: ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ‘ఒక్క ఛాన్స్’ యుద్ధాన్ని మొదలుపెట్టారు. వైఎస్ జగన్ 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే అస్త్రంగా మలిచి వైసీపీ సర్కార్ పై సోమువీర్రాజు పోరు షురూ చేశారు. జగన్ ఒక్క చాన్స్ తో ఏపీ ఇల్లు గుల్ల చేశాడని ఆరోపిస్తున్నారు.

    ap bjp somu veeraju

    సోము వీర్రాజు తాజాగా లాజిక్ ప్రశ్నలు బయటకు తీశాడు. ఏపీ అప్పు రూ.6 లక్షల కోట్లు దాటిందన్నారు. దానికి 7శాతం చొప్పున వడ్డీతో ఏటా రూ.42వేల కోట్లు కడుతున్నాం.. నెలకు రూ.42వేల కోట్లు కడుతున్నాం. నెలకు రూ.3500 కోట్లు, రోజుకు రూ.116 కోట్లు కడుతున్నాం. సగటున ప్రతీ వ్యక్తి రోజుకు రూ.23, నెలకు రూ.690, ఏడాదికి రూ.8280 కడుతున్నారంటూ ఏపీ సర్కార్ ను లెక్కలతో కొట్టారు.

    ఇంట్లో నలుగురు ఉంటే 8280 x 4 =33120 తెలియకుండానే కడుతున్నాం అని సోము వీర్రాజు అన్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ఇది మన దుస్థితి అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

    ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలపై ప్రతీసారి సోము వీర్రాజు పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఇరుకునపెట్టేలా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ ఇళ్ల నిర్మాణం, జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై దూకుడుగా విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్లారు.