Karishma Sharma Injured: ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా శర్మ(Karishma Sharma) కి తీవ్రమైన గాయాలై హాస్పిటల్ పాలైంది. రైలు నుండి దూకేయడం వల్ల ఈ ఘటన జరిగిందని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘షూటింగ్ కి వెళ్లేందుకు చర్చి గెట్ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఎక్కాను. కానీ నాతో పాటు వచ్చే నా స్నేహితురాలు మాత్రం రైలు మిస్ అయ్యింది. దీంతో ఆ క్షణం లో కంగారులో ఏమి చెయ్యాలో తెలియక కదులుతున్న రైలు నుండి దూకేసాను. దేవుడి దయవల్ల నాకు ఎలాంటి ప్రాణాపాయం లేదు కానీ , నా తల మరియు వీపుకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. నేను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించండి. మీ ప్రేమాభిమానాలతో త్వరలోనే పూర్తిగా కోలుకొని మీ ముందుకొస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కరిష్మా శర్మ.
దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కరిష్మా తొందరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కరిష్మా ఇప్పటి వరకు ఎలాంటి తెలుగు సినిమా చేయలేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం మంచి పాపులర్. 2014 వ సంవత్సరం లో ‘పవిత్ర రిస్తా’ అనే టీవీ సీరియల్ తో ఈమె కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ సీరియల్ పెద్ద హిట్ అయ్యి మంచి పాపులారిటీ రావడం తో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ‘ప్యార్ కి పంచనామా 2’, ‘సూపర్ మిలన్’, ‘సూపర్ 30’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలు చేసింది. అదే విధంగా ‘రాగిణి MMS రిటర్న్స్’ లాంటి సంచలనాత్మక వెబ్ సిరీస్ లో కూడా లీడ్ క్యారక్టర్ చేసింది. అలా ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్, మరోపక్క టీవీ సీరియల్స్, ఇలా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీ గా గడుపుతుంది కరిష్మా శర్మ. అంతే కాదు ఈమె మ్యూజిక్ వీడియోస్ కి కూడా మంచి పాపులర్ సెలబ్రిటీ.