Mirai Opening Day Collections: బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేసి తనకంటూ చిన్నతనం లోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ(Teja Sajja), పెద్దయ్యాక హీరో అవుతాడని, హీరో గా సక్సెస్ కూడా అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పెద్దయ్యాక ‘ఓ బేబీ’ చిత్రం తో ఆయన ప్రేక్షకుల ముందుకే వచ్చాడు. ఆ తర్వాత జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం వంటి సినిమాలు చేసాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూడు సినిమాల తర్వాత వచ్చిన ‘హనుమాన్’ చిత్రం మాత్రం తేజ సజ్జ జాతకాన్ని మార్చేసింది. చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక నేడు విడుదలైన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రానికి కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ లో మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం, మన తెలుగు రాష్ట్రాల్లో నూన్ షోస్ నుండే కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.
బుక్ మై షో లో ప్రస్తుతానికి ఈ సినిమాకి గంటకు 22 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. హిందీ వెర్షన్ కలెక్షన్స్ కూడా బాగా పుంజుకున్నాయి. ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ రికార్డు స్థాయిలో ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. పబ్లిక్ టాక్ కూడా ఓవర్సీస్ లో వచ్చిన టాక్ కి, తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన టాక్ కి పెద్దగా తేడా లేదు. అంటే సినిమాకు నిజంగానే సూపర్ హిట్ టాక్ నడుస్తుంది.
మరో రెండు వారాల వరకు ఎలాంటి సినిమా లేదు కాబట్టి ఈ చిత్రానికి కచ్చితంగా మంచి లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉందని, దసరా సెలవుల్లో కూడా ఈ సినిమా ప్రదర్శితమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆ రేంజ్ లాంగ్ రన్ వస్తే ఈ చిత్రానికి కూడా క్లోజింగ్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు. అదే కనుక జరిగితే మన టాలీవుడ్ స్టార్ హీరోలు సిగ్గుతో తల దించుకునే ప్రస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభాస్, అల్లు అర్జున్ మినహా, మిగిలిన ఏ హీరోలు కూడా ఇప్పటి వరకు సోలో గా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టలేకపోయారు. ఒకవేళ తేజ సజ్జ కొడితే నిజంగానే పరువు పోయినట్టు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు.