OG advance bookings: మరో 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మూవీ లవర్స్ కి ఒక పండగ లాంటి ఈవెంట్ రాబోతుంది. అదే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ గ్యాంగ్ స్టర్ జానర్ లో సినిమా తీస్తే ఎలాంటి హైప్, క్రేజ్ ఏర్పడుతుందో, ఈ చిత్రానికి కూడా అలాంటి హైప్, క్రేజ్ ఏర్పడింది. అందుకు ఉదాహరణ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్. కేవలం ఒక్క నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, పోలాండ్, నెథర్లాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ట్రైలర్ విడుదల తర్వాత భారీ రేంజ్ లో ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.
కానీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ట్రైలర్ ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. కానీ అప్పుడే ఓవర్సీస్ నుండి 62 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది,కానీ అప్పుడే ఈ స్థాయిలో టికెట్స్ అమ్మకం జరిగిందంటే జనాలు ఈ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే కేవలం నార్త్ అమెరికా నుండీ ఈ చిత్రానికిఇ దాదాపుగా 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇక మిగిలిన అన్ని ఫారిన్ దేశాలకు కలుపుకుంటే 62 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
గ్రాస్ వసూళ్లు దాదాపుగా 15 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఓజీ సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు నెథర్లాండ్, పోలాండ్ మరియు ప్యారిస్ లాంటి దేశాల్లో ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలకు టికెట్స్ అమ్ముడుపోలేదు. ముఖ్యంగా నెథర్లాండ్స్ లో అయితే తమిళ సినిమాలకే దిక్కు లేదు. కూలీ చిత్రానికి ఇక్కడ వెయ్యి కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇదే ఆల్ టైం రికార్డు. కానీ ఓజీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన 24 గంటల్లోనే 500 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం ఇక్కడ భారీ మార్జిన్ తో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి సంచలనం సృష్టించేలా అనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే, ఓజీ కి మొదటి రోజు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 6 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.