Jayaprada- Krishnam Raju: తెలుగు చిత్రసీమలో శ్రీ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. రెబల్ స్టార్ మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు నేడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి ఫామ్‌హౌస్‌లో జరుగనున్నాయి. కృష్ణంరాజు గారి అంతిమ యాత్రలో… పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 1 గంటలకు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మరో పక్క కృష్ణంరాజు గారి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. తాజాగా కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి జయప్రద బోరున విలపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.
అయితే, ఈ సందర్భంగా జయప్రద కృష్ణంరాజు గారి గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జయప్రద ఏం మాట్లాడింది అంటే.. ‘కృష్ణంరాజు గారు మచ్చలేని మనిషిగా, జీవితాంతం ఆయన రారాజుగానే బ్రతికారు. కానీ, నేను ఇప్పుడు ఆయనను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇది నాకు చాలా బాధాకరమైనది. ఆయనతో నాకు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది’ అని జయప్రద కన్నీళ్లను ఆపుకుంటూ బోరున ఏడ్చింది.

అనంతరం.. ఆమె మళ్ళీ మాట్లాడుతూ.. ‘కృష్ణంరాజు గారి పిల్లలు చాలా చిన్నవాళ్లని, వారిని చూస్తే బాధేస్తోంది’ అని జయప్రద మళ్లీ కన్నీటి పర్యంతం అయ్యింది. రంగూన్ రౌడీ, తాండ్రపాపారాయుడు, సీతారాములు తదితర సినిమాల్లో రెబల్ స్టార్‌తో జయప్రద కలిసి నటించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
అలాగే మరో సీనియర్ హీరోయిన్, మంత్రి రోజా కూడా ఆయనకు నివాళులర్పిస్తూ.. ‘సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రోజా చెప్పుకొచ్చింది. పైగా ప్రభుత్వం తరఫున కృష్ణంరాజు అంత్యక్రియల్లో మంత్రి రోజా పాల్గొనబోతుంది.