https://oktelugu.com/

Adire Abhi: హైపర్ ఆది లైఫ్ ఇచ్చిన టీమ్ నుండి ఎందుకు వెళ్ళిపోయాడు… వాస్తవాలు బయటపెట్టిన గురువు అదిరే అభి!

హైపర్ ఆదితో విభేదాలు రావడం వల్లే అభి జబర్దస్త్ మానేసాడు అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. గతంలో కూడా ఈ పుకార్లను ఇద్దరూ కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అదిరే అభి ఈ రూమర్స్ పై స్పందించాడు.

Written By: , Updated On : May 25, 2024 / 03:46 PM IST
Adire Abhi Gives clarity about Clashes With Hyper Aadi

Adire Abhi Gives clarity about Clashes With Hyper Aadi

Follow us on

Adire Abhi: జబర్దస్త్ మాజీ కమెడియన్స్ లో అదిరే అభి ఒకరు. దాదాపు ఏడేళ్ల పాటు టీం లీడర్ గా కొనసాగాడు. తనదైన కామెడీ టైమింగ్, హిలేరియస్ పంచులతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ షో ద్వారా అదిరే అభికి మంచి గుర్తింపు లభించింది. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా అదిరే అభి రాణించాడు. ప్రస్తుతం అదిరే అభి జబర్దస్త్ లో లేడు. ఆయన జబర్దస్త్ లో కనిపించి ఏళ్ళు గడుస్తుంది. వ్యక్తిగత కారణాలతో అదిరే అభి జబర్దస్త్ వీడటం జరిగింది.

అయితే హైపర్ ఆదితో విభేదాలు రావడం వల్లే అభి జబర్దస్త్ మానేసాడు అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. గతంలో కూడా ఈ పుకార్లను ఇద్దరూ కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అదిరే అభి ఈ రూమర్స్ పై స్పందించాడు. అసలేం జరిగిందో క్లారిటీగా వివరించాడు. అభి మాట్లాడుతూ .. ”హైపర్ ఆది నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాతో విబేధాల కారణంగానే బయటకు వెళ్ళిపోయాడు అన్న వార్తల్లో నిజం లేదు.

అప్పట్లో కొత్త టీమ్స్ ఏర్పాటు చేయాలని సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరిని కలిపి ఒక టీంను తయారు చేశారు. అలా హైపర్ ఆదికి టీం లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. హైపర్ ఆది టీం లీడర్ అయినందుకు సంతోషించాను. నాకు సినిమా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జబర్దస్త్ లో కొనసాగుతూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై ఫోకస్ పెట్టాను. ఇప్పుడు కూడా దర్శకుడిగా సక్సెస్ కావాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను”, అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా హైపర్ ఆది ని జబర్దస్త్ కి పరిచయం చేసింది అదిరే అభినే. అందుకే హైపర్ ఆదికి అదిరే అభి గురువు లాంటివాడు. అదిరే అభి టీం లో కమెడియన్ గా చేస్తూ ఆది టీం లీడర్ గా ఎదిగాడు. తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ హోదా దక్కించుకున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది అటు సినిమాలు మరోవైపు షోలు చేస్తు బిజీగా మారిపోయాడు.