https://oktelugu.com/

Actress Chitra Passes away – విషాదం : ప్రముఖ నటి మృతి !

Actress Chitra Passes away: సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో నటిని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయింది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర ( Actress Chitra) ఇక లేరు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే, గత వారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. గుండెపోటుతో చిత్ర మృతి […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2021 / 03:09 PM IST
    Follow us on

    Actress Chitra Passes away: సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో నటిని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయింది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర ( Actress Chitra) ఇక లేరు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే, గత వారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించినా ఉపయోగం లేకుండా పోయింది.

    గుండెపోటుతో చిత్ర మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. నల్లెనై చిత్ర వయసు ప్రస్తుతం 56 సంవత్సరాలు. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నల్లెనై చిత్ర అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే చిన్నతనంలోనే మంచి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.

    ఇక ఆ తర్వాత చిత్ర హీరోయిన్ గా కూడా నటించి మెప్పించారు. ముఖ్యంగా 1980-90 మధ్య కాలంలో ఆమె పలు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించారు. అయితే, వడక్కన్ వీరగాథ, పరంపర, కలిక్కలం వంటి మలయాళ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.

    ప్రస్తుతం ఆమె పలు తమిళ సీరియల్స్‌ లో కూడా నటిస్తున్నారు. కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నల్లెనై చిత్ర మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.