Actress Anjali Raghav Controversy: చిత్ర పరిశ్రమలో హీరో అంటే చాలు ఎక్కడా లేని కొమ్ములు వస్తుంటాయి. తామే సర్వ పరిత్యాగులమని.. సినిమా తమ వల్లే బతుకుతోందని.. తమ వల్లే సినిమాలు ఆడుతున్నాయని హీరోలు ఫీల్ అయిపోతుంటారు. ఎంత వయసు వచ్చినా సరే.. కూతురు లాంటి వయసున్న వారితోనే ఆడిపాడుతుంటారు. చివరికి చేయకూడని దారుణాలు చేస్తుంటారు. కెరియర్ లో ఎదగాలని కోరిక ఉండడంతో చాలామంది హీరోయిన్లు ఈ విషయాలను బయట చెప్పరు. బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. లోలోపల మదనపడుతూ.. హీరోలు చేసే వికృత చేష్టలను భరిస్తూ.. మౌనంగా ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చింది. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న హీరో వ్యవహార శైలిని నడిబజార్లో నిలబెట్టింది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ఈ వుడ్, ఆ వుడ్ అని తేడా లేదు.. అన్ని చిత్ర పరిశ్రమలలోనూ హీరో దే డామినేషన్. నిర్మాతలు కేవలం డబ్బులు ఇవ్వడానికి పనికొస్తారు. హీరోయిన్లు ఆడి పాడేందుకు మాత్రమే ఉపయోగపడతారు. ఈ అడ్వాంటేజ్ ను ఆసరాగా చేసుకొని చాలామంది హీరోలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. అలా ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఓ హీరో బాగోతాన్ని ఓ హీరోయిన్ బయటపెట్టింది. ఆ హీరో పేరు పవన్ సింగ్. భోజ్ పూరి చిత్ర పరిశ్రమలో పేరుపొందిన నటుడు. ఇటీవల లక్నోలో ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అంజలి అనే నటి కూడా హాజరైంది. బహిరంగ వేదికగానే పవన్ సింగ్ ఆమె నడుమును అసభ్యకరంగా తాకాడు. అంతటి జన సందోహం మధ్య ఆమె నడుమును తాకి అతడు వికృతానందం పొందాడు. దీనిని ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ అనుకున్నప్పటికీ.. అతడు కావాలని అలా చేశాడని తెలుస్తోంది. దీనిపై అంజలి నోరు విప్పింది.
బాధపడుతూనే ఉన్నాను
ఈ సంఘటన జరిగిన వాటి నుంచి తాను బాధ పడుతూనే ఉన్నానని అంజలి వాపోయింది. స్వీయ వీడియోలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. పవన్ సింగ్ కు వారి నెట్వర్క్ ఉందని.. అందువల్లే అతడిని ప్రశ్నించలేకపోయానని అంజలి వాపోయింది. ఒకవేళ ఈ ఘటన గనుక హర్యానాలో జరిగి ఉంటే ప్రజలు అతడికి బుద్ధి చెప్పే వాళ్ళని పేర్కొంది. జరిగిన సంఘటన లక్నోలో కాబట్టి తాను ఏమీ చేయలేకపోయానని అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి నటులు ఉన్న భోజ్ పూరి చిత్ర పరిశ్రమలో తాను అడుగుపెట్టబోనని.. ఆ చిత్రాలలో తాను నటించబోనని అంజలి స్పష్టం చేసింది. అయితే అంజలి చేసిన వ్యాఖ్యలకు అన్ని పరిశ్రమల నుంచి మద్దతు లభిస్తున్నది. ఇటువంటి వ్యక్తులను హీరోలుగా పరిగణించకూడదని.. చిత్ర పరిశ్రమ నుంచి వెలివేయాలని డిమాండ్ వ్యక్తమౌతోంది.
A controversial moment unfolded when Bhojpuri actor Pawan Singh faced backlash after a video showed him touching a woman’s waist during a public event. The clip has since gone viral, drawing sharp criticism online.
For many, the act was seen as inappropriate and disrespectful,… pic.twitter.com/2MIdoV2fHd
— MissMohini (@MohiniWealth) August 29, 2025