Radhakishan Damani Success Story: కొందరికి ఏం చేసినా లక్ కలిసి రాదు. కొందరు మట్టి ముట్టుకున్నా సరే బంగారం అవుతుంది. ఈ వ్యక్తి రెండవ కేటగిరికి చెందినవాడు. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ.. రాత్రికి రాత్రికే ఆగర్భ శ్రీమంతుడు కాలేదు. ఇండియాలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ.. ఒక్క రోజులోనే అది పూర్తి కాలేదు. దీని వెనక కష్టం ఉంది. అన్నింటికీ మించి తాపత్రయం ఉంది. అదే అతనిని ఈ స్థాయిలో నిలబెట్టింది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
తన పేరే ఓ బ్రాండ్
మనదేశంలో డిమార్ట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. నగరాలు మాత్రమే కాదు గ్రామాలలో కూడా ఈ బ్రాండ్ లోతుగా నాటుకు పోయింది. అంతర్జాలంలో లభ్యమవుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి డిమార్ట్ ఏకంగా 59,358 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది.. అంతేకాదు దేశవ్యాప్తంగా 415 రిటైల్ స్టోర్లు ఈ సంస్థకు ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం గంటకు దాదాపు నాలుగు లక్షలకు పైగా ఒక స్టోర్ నుంచి ఆదాయం వస్తోంది. ఒక రోజుకు 45 లక్షల వరకు రెవెన్యూ వస్తోంది. పప్పుల నుంచి బ్రాండెడ్ బట్టల దాకా ప్రతి వస్తువు డిమార్ట్ లో లభిస్తోంది. ఒకప్పుడు పప్పు ఉప్పులు మాత్రమే విక్రయించే తన సంస్థను ఈ స్థాయి దాకా తీసుకెళ్లడానికి రాధాకృష్ణ ధమాని తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు. చివరికి తన పేరుతో డిమార్ట్ అనే సంస్థను ఏర్పాటు చేయడమే కాదు.. వేలాదిమందికి ఉపాధి కల్పించే సంస్థగా మార్చాడు. ప్రస్తుతం డీమార్ట్ సంస్థలో 13,971 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 59,961 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు.. మొత్తంగా 80 వేల మందికి డి మార్ట్ సంస్థల్లో ఉపాధి లభిస్తోంది.
రిటైల్ మార్కెట్లో..
మనదేశంలో రిటైల్ విభాగంలో ఫ్యూచర్ గ్రూప్ ప్లాఫ్ అయిన తర్వాత.. ఈ విభాగంలోకి రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా వంటివి ప్రవేశించాయి. ఇందులో ఈ మూడు సంస్థలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే ఇవి చూడని విజయాన్ని డిమార్ట్ సొంతం చేసుకుంది. నగరం నుంచి మధ్య స్థాయి పట్టణం వరకు స్టోర్ ఏర్పాటు చేసుకుంటూ తన వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయింది.. కస్టమర్లకు చవకైన ధరలో నిత్యవసరాలు.. ఇతర వస్తువులు అందిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుంది డిమార్ట్. దాదాపు ఆరు స్టోర్లలో వివిధ రకాల వస్తువులను ఏర్పాటు చేసి.. వినియోగదారుల మనసును చూరకొంటున్నది. ఇక ఈ సంవత్సరం మార్చి 31 వరకు డిమార్ట్ కనివిని ఎరుగని స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024తో పోల్చి చూస్తే ఫైనాన్షియల్ 2025 ఇప్పటివరకు 59,358 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. 2024 తో పోల్చి చూస్తే 16.7% వృద్ధిని నమోదు చేసింది. 2024లో 50,789 కోట్ల ఆదాయాన్ని డిమార్ట్ సొంతం చేసుకుంది. మన దేశంలో ఢిల్లీ నుంచి మొదలుపెడితే కరీంనగర్ వరకు డిమార్ట్ కు శాఖలు ఉన్నాయి. ఉదయం స్టోర్ తెరిచిన దగ్గరనుంచి రాత్రి మూసే వరకు నిత్యం జన జాతర సాగుతూనే ఉంటుంది డిమార్ట్ లో. అందువల్లే ఈ స్టోర్ లకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది.
అంతగా అనుభవం లేదు
వాస్తవానికి రిటైల్ మార్కెట్లు ప్రారంభించే నాటికి రాధాకృష్ణకు పెద్దగా అనుభవం లేదు. ఏదైతే అది అయిందనుకొని ఇందులోకి దిగారు. మొదట్లో నిత్యవసరాలు మాత్రమే అమ్మేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర విభాగాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఈ వ్యాపారంలో లోటుపాట్లను ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో ఈ వ్యాపారం నుంచి బయటికి వెళ్లాలని అనుకున్నారు. ఆ తర్వాత ఏదో ఒక నమ్మకం ఆయనను ముందుకు నడిపించింది. అది కాస్త ఈ స్థాయి దాకా చేర్చింది. మనదేశంలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు సాధ్యం కాని ఘనతను డిమార్ట్ సొంతం చేసుకుంది. సగటు భారతీయుడికి నమ్మకమైన బ్రాండ్ గా ఎదిగింది.