SSMB 29 Priyanka Chopra: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది దర్శకులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. దర్శకధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి మాత్రం ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ను రాజమౌళి బయటకు అయితే చెప్పడం లేదు. ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ ఫేస్ రివిల్ చేయకుండా ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశాడు. దానికి మహేష్ బాబు అభిమానులు కొంతవరకు సంతృప్తి చెందినప్పటికి మహేష్ బాబు బర్త్ డే రోజు ఆయన సినిమా నుంచి రావాల్సిన అప్డేట్ ఇది కాదని వాళ్లు చాలా వరకు నిరుత్సాహపడుతున్నారు. ఇక వాళ్ల డిసప్పాయింట్ మెంట్ ను అర్థం చేసుకున్న రాజమౌళి నవంబర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని ప్రేక్షకులతో పంచుకోబోతున్నట్టుగా తెలియజేశాడు. ఇక థర్డ్ షెడ్యూల్ కోసం ఈ సినిమా యూనిట్ దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడ షూట్ చేయాలనే నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక దానికి అనుగుణంగానే రాజమౌళి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా తను దిగిన కొన్ని ఫోటోలను ప్రస్తుతం తన ఇన్ స్టా లో అప్లోడ్ చేసింది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
చాలామంది జనాలు ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతొంది అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆమె పెట్టిన ఫోటోలకు సంబంధించిన లొకేషన్స్ ని గుర్తుపట్టి మీరు కెన్యాలో ఉన్నారు కదా అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక దీని మీద మహేష్ బాబు భార్య అయిన నమ్రత సైతం ఆ ఫోటోలకు ఒక లైక్ అయితే కొట్టారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ని అటు మహేష్ బాబు గానీ అందులో నటిస్తున్న నటీనటులు గాని ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు కొంతవరకు విసుగు చెందుతున్నారు. మరి రాజమౌళి ఏ అప్డేట్ ఇచ్చిన కూడా హై రేంజ్ లో ఉంటుంది.
కాబట్టి దాన్ని వీలైనంత వరకు దాచిపెట్టు మరి తను ఒక పవర్ ప్యాక్ అప్డేట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పటినుంచి జరుగుతోంది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడైతే దానికి సంబంధించిన పనులను శరవేగంగా చేస్తూ ముందుకు సాగుతున్నారు…
View this post on Instagram