Homeఎంటర్టైన్మెంట్అయ్యో.. దయనీయ పరిస్థితిలో ప్రముఖ నటి !

అయ్యో.. దయనీయ పరిస్థితిలో ప్రముఖ నటి !

Anaya soni kidney failureఈ అధునాతన ప్రపంచంలో ఎవరికీ ఏ అనారోగ్య సమస్య ఎప్పుడు వస్తోందో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. ఉన్నట్టు ఉండి సమస్యల వలయంలో పడిపోయి జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోవచ్చు. ఆమె గత మూడు నెలలు క్రితం వరకు కరోనా బాధితులకు సాయం అందించింది. కానీ, నేడు ఆమె సాయం కోరుతూ హాస్పిటల్ బెడ్ మీద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె బుల్లితెర నటి ‘అనయ సోని’.

గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనయ సోని పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు, గత వారం ఆమె తీవ్ర అస్వస్థతకు గురి అయింది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని హోలీ స్పిరిట్‌ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కానీ, ఆమె ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది.

అసలు ఉన్నట్టు ఉండి ఆనయకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఆమె వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఏమి మాట్లాడింది అంటే.. ‘బాధగా ఉంది, ఇలాంటి వీడియో నేను చేయాల్సి వస్తున్నందుకు. మా అమ్మగారికి ఉన్న గార్మెంట్స్‌ బిజినెస్‌ కొంతకాలం కొలాప్స్ అయిపోయింది. ఇంటికి నిప్పంటుకోవడంతో ఆ బిజినెస్ లో ప్రతి ఐటమ్ బట్టలు, మెషీన్లు ఇలా అన్నీ బూడిదయ్యాయి’ అంటూ ఆమె కన్నీళ్లు ఆపుకుంటూ..

తీవ్రమైన బాధను దిగమింగుకొని.. ‘ఇప్పుడు మాకు తినడానికి కూడా తిండి లేదు. ఇంత దయనీయ పరిస్థితి మాకు వచ్చింది. దీనికి తోడు నాకింకా డయాలిసిస్‌ కూడా మొదలు పెట్టలేదు. ఇప్పుడు అర్జంట్‌ గా ఓ కిడ్నీ దాత కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. దయచేసి నాకు సాయం చేయండి” అంటూ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేసింది ఆనయ సోనీ. ఆమెకు సాయం చేస్తే.. ఆమె ప్రాణాలను కాపాడినవారు అవుతారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular