Maldives
Maldives : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులు కొత్త విదేశీ కరెన్సీ నియంత్రణను ప్రవేశపెట్టింది. విదేశీ కరెన్సీ అనుమతించమడిన లావాదేవీల రకాలను పరిమితం చేసింది. పర్యాటక సంస్థలు, బ్యాంకులపై తప్పనిసరి విదేశీ కరెన్సీ మార్పిడి నియంత్రణ విధించింది. మరోవైపు భారత్‌తో మళ్లీ స్నేహం కోసం ప్రయత్నిసు‍్తన్న అధ్యక్షుడు మొయిజ్జు ఇటీవలే భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 50 మిలియన్ డాలర్ల వడీ‍్డ రహిత రుణాన్ని పొడిగించింది. దీంతో ఇస్లామిక్ బాండ్ చెల్లింపులో డీఫాల్ట్ నుంచి బయటపడింది.మాల్దీవల ఫారెక్స్ నిల‍్వలు దీ‍్వపదేశ దిగుమతి బిల్లుతో సరిపోలకపోవడంతో సెంట్రల్ బ్యాంకు.. మాల్దీవుల మనిటరీ అథారిటీ అక్టోబర్ 1న కొత్తనిబంధన ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యలో పర్యాటక పరిశ్రమ ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ ఆదాయాన్ని స్థానిక బ్యాంకుల్లో జమ చేయాలని కోరింది. చెల్లింపులకు డాలర్ల కొరత ఏర్పడడంతో ఆగస్టులో మాల్దీవుల సెంట్రల్ బ్యాంకు ఈ రూల్స్ తీసుకు వచ్చింది. విదేశీ కరెన్సీ రెగ్యులేషన్ ప్రకారం మాల్దీవుల్లోని అన్ని లావాదేవీలు తప్పనిసరిగా మాల్దీవీయన్ రుఫీయాలో నిర్వహించాలని ఆదేశించింది. విదేశీ కరెన్సీలో అనుమతించబడిన వాటికి మినహాయింపు ఉంటుంది.
స్థానిక కరెన్సీలో లావాదేవీలు..
ఇక సెంట్రల్ బ్యాంకు తాజా నిబంధనల మేరకు గూడ్స్ అండ్ సర్వీస్ పేమెంట్స్, పనుల విలువ, రుసుములు, చార్జీలు, అద్దె, వేతనాలు స్థానిక కరెన్సీలోనే జరుపుతోంది. వాటిని విదేశీ కరెన్సీలో ఈ లావాదేవీల కోసం ఇన్‌వాయిస్ చేయడాన్ని నిషేధిస్తుంది. కేవలం నిర్ధేశించిన చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో టూరిస్ట్ రిసార్ట్‌లు, గెస్ట్ హౌస్‌లు మొదలైన వాటి అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం మాల్దీవుల్లోని లైసెన్స్ పొందిన బ్యాంకులో ఉన్న విదేశీ కరెన్సీ ఖాతాకు జమ చేయాలి‍్స ఉంటుంది. ప్రతీ టూరిస్టు రిసార్ట్, టూరిస్ట వెసెల్ లేదా టూరిస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆపరేటర్ ఒక టూరిస్ట్‌కు కనీసం 500 డాలర్లను లైసెనుస పొందిన బ్యాంకుల ద్వారా స్థానిక కరెన్సీలోకి మారు‍్చకునేందుకు అనుమతించింది.
నిబంధన అతిక్రమిస్తే జరిమానా..
ఇక సెంట్రల్ బ్యాంకు నిబంధనలను పాటించానివారిపై భారీగా జరిమానా విధించాలని మాల్దీవుల ప్రభుత్వం స‍్పష్టం చేసింది. ప్రస్తుతం అప్పులు జీడీపీలో 110 శాతంగా ఉన్నాయి. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం బయటి రుణాలు 2025 నాటికి 557 మిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The maldives reeling from a financial crisis has introduced new foreign currency controls
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com