https://oktelugu.com/

Beast Box Office Collection: మూడోరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ‌సూలు చేసిన బీస్ట్‌.. ఇంకెంత రావాలంటే..?

Beast Box Office Collection: త‌మిళ హీరోల‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు తెలుగు హీరోల‌తో పోటీ ప‌డి మరీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంటాయి. అంత‌లా ఆయ‌నకు ఇక్క‌డ ఫ్యాన్స్ ఉన్నారు. మొద‌టి నుంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల‌తో వ‌స్తుంటాడు. ఇక రీసెంట్ గా బీస్ట్ మూవీతో ప‌ల‌క‌రించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ మూవీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 16, 2022 / 01:09 PM IST
    Follow us on

    Beast Box Office Collection: త‌మిళ హీరోల‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు తెలుగు హీరోల‌తో పోటీ ప‌డి మరీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంటాయి. అంత‌లా ఆయ‌నకు ఇక్క‌డ ఫ్యాన్స్ ఉన్నారు. మొద‌టి నుంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల‌తో వ‌స్తుంటాడు.

    Beast Box Office Collection

    ఇక రీసెంట్ గా బీస్ట్ మూవీతో ప‌ల‌క‌రించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసింది. ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం ఈ మూవీ తెలంగాణ‌, ఆంధ్రాలో క‌లిపి రూ.10కోట్ల మేర బిజినెస్ జ‌రుపుకుంది. నెల్సన్ దిలీప్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీతో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించింది.

    Also Read: Prabhas: ఎన్టీఆర్‌, య‌శ్‌, రామ్‌చ‌ర‌ణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌భాస్‌..

    అయితే మూడో రోజు కూడా ఈ మూవీ బాగానే వ‌సూల్లు రాబ‌ట్టింది. మూడో రోజు రూ. 78 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ ను రాబ‌ట్టింది. ఇక మొత్తంఆ మూడు రోజుల్లో క‌లిపి బీస్ట్ మూవీ నైజాంలో రూ.2.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు వ‌సూలు చేసింది. ఇక అటు ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ ఏరియాలో రూ. 47 లక్షలు వెస్ట్ ఏరియాలో రూ.37 లక్షలు ఇలా అన్ని ప్రాంతాల్లో క‌లిపి రూ.6.69 కోట్లు షేర్ తో పాటు రూ.11.65 కోట్ల గ్రాస్ ను రాబ‌ట్టింది.

    Beast Box Office Collection

    తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.6.69 కోట్లు వ‌సూలు చేసింది. ఇంకో రూ. 3.81 కోట్లు రాబ‌డితే ఈ మూవీ హిట్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఇక మూడోరోజు ఓ రికార్డు నెల‌కొల్పింది బీస్ట్ మూవీ. అదేంటంటే త్రిబుల్ ఆర్ కు స‌మానంగా మూడోరోజు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. ఈ మూవీకి రూ. 78 లక్షలు వ‌స్తే.. RRRకు మూడో రోజు రూ.84 లక్షలే రావ‌డం గమనార్హం. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన త్రిబుల్ ఆర్ మూవీకి ఈ మూవీ పోటీనివ్వ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

    Also Read:Samantha: జిమ్ డ్రెస్‌లో ఘాటైన అందాల‌ను చూపించిన స‌మంత‌.. వీడియో వైర‌ల్‌

    Tags