Amala Paul: అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఇక ఈ మధ్య బోల్డ్ సినిమాల్లో నటిస్తూ వెండితెరపై అభిమానులను అలరిస్తుంది. అంతేకాదు ఈమె నటించిన కొన్ని సినిమాలో మంచి హిట్ ను సంపాదించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బేబీ బంప్ తో ఈ మధ్య హీరోయిన్ లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు అమలా పాల్ కూడా ఓ ఫోటో పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
2014 కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అమలా. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఎక్కువ కాలం పాటు తన వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. మనస్పర్థలు ఎక్కువగా రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత బోల్డ్ పాత్రలలో నటిస్తూ వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత మళ్లీ రెండో వివాహం చేసుకుంది అమ్మడు. జగత్ దేశాయ్ అనే వ్యక్తిని మరో సారి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రెండు నెలలు కూడా తిరగకముందే బేబీ బంప్ తో అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అయ్యాక ప్రెగ్నెంట్ అయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద బేబీ బంప్ తో ఉన్న అమలాపాల్ బీచ్ దగ్గర తన భర్తతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ మధ్య ఇలియానా కూడా భర్త ఎవరో తెలియజేయకుండానే బేబీ బంప్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చివరకు నిజం చెప్పి అందరినీ కూల్ చేసింది. కానీ అమలా పాల్ పెళ్లి జరిగి రెండు నెలల కాకుండానే బేబీ బంప్ ను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో కొందరు విమర్శిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Actress amala paul announces her pregnancy with baby bump photos
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com