Actor Vinayakan: ఎన్నో సినిమాల్లో నటించిన జైలర్ సినిమాలో విలన్ రోల్ లో నటించి మంచి పేరు సంపాదించిన నటుడు వినాయకన్. కానీ ఈయన ఇప్పుడు అరెస్ట్ అయ్యారట. అదేంటి ఏదైనా సినిమా షూటింగా? అనుకుంటున్నారా? కాదు సినిమాల్లో విలన్ పాత్ర పోషించే ఈ నటుడు బయట కూడా విలన్ మాదిరి ప్రవర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేశారని టాక్. అయితే ఈయన కేరళలోని ఎర్నాకులంలో నివాసం ఉంటున్నారు. అక్కడ మద్యం సేవించి చుట్టు పక్కల వారికి ఇబ్బంది కలిగించారట. అందుకే చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారట.
అయితే న్యూసెన్స్ కేసు మీద అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడని టాక్. దీంతో పోలీసులు జైల్లో పెట్టారని తెలుస్తోంది. ఇక జైలర్ సినిమాతో ఫేమ్, నేమ్ సంపాదించిన వినాయకన్ ప్రవర్తన తెలిసిన ఆయన అభిమానులు మండి పడుతున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తే బయట కూడా అలా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జైలర్ సినిమా రజినీతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపించి అద్భుతంగా నటించాడు. భయపెట్టి, నవ్వించి స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నాడు. హీరో, విలన్ పాత్రలు రెండు కూడా పోటీ పడ్డట్టుగా ఉంది.
విలన్ గ్యాంగ్ చేసే డ్యాన్స్ లు, కామెడీ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. ఇలా మంచి పాత్రను పోషించిన వినాయకన్ సడన్ గా మద్యం సేవించి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆయన అభిమానులకు కూడా కోపం తెప్పించాడు. కానీ మంచి ఫేమ్ నేమ్ ఉన్న నటుడు ఇలా ప్రవర్తించి తర్వాత వచ్చే అవకాశాలను కూడా కోల్పోయేలా చేసుకుంటున్నాడు. ఇక జైలర్ తర్వాత ఏ సినిమా నుంచి కూడా ఆఫర్ వచ్చినట్టు టాక్ లేదు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఈ నటుడు తన ప్రవర్తనతో ఇండస్ట్రీ నుంచి దూరమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.