https://oktelugu.com/

సింపుల్ గా పెళ్లికానిచ్చేసిన నిఖిల్

  టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. శామిర్ పేటలోని ఓ ప్రయివేట్ అతిథిగృహంలో గురువారం ఉదయం 6.31గంటలకు నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇరుకుటుంబాలకు చెందిన కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరు ఒక్కటయ్యారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ నిఖిల్ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. నిఖిల్ పెళ్లి తొలుత ఏప్రిల్ 16న అనుకున్నప్పటికీ దేశంలో లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత మే 14న పెళ్లి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 14, 2020 / 02:31 PM IST
    Follow us on

     

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. శామిర్ పేటలోని ఓ ప్రయివేట్ అతిథిగృహంలో గురువారం ఉదయం 6.31గంటలకు నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇరుకుటుంబాలకు చెందిన కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరు ఒక్కటయ్యారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ నిఖిల్ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు.

    నిఖిల్ పెళ్లి తొలుత ఏప్రిల్ 16న అనుకున్నప్పటికీ దేశంలో లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత మే 14న పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే దేశంలో లాక్డౌన్ పొడగిస్తుండటంతో మరోసారి పెళ్లి వాయిదా వేసుకునేందుకు నిఖిల్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకునేందుకు ఇరుకుటుంబాలు అంగీకరించారు. నిన్న ఇరు కుటుంబాల ఇంట్లో సింపుల్ గా వివాహ వేడుకలు జరుగగా నేడు ఉదయం పెళ్లితో నిఖిల్-పల్లవి వర్మలు ఒక్కటయ్యారు. పల్లవి వర్మ వైద్యురాలిగా సేవలందిస్తుంది. ఇక నిఖిల్ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నాడు. వీరిద్దరి ప్రేమ వివాహం. ఎట్టకేలకు నిఖిల్ ఓ ఇంటివాడు కావడంతో అభిమానులు, పలువురు సెలబ్రెటీలు వివాహా శుభాకాంక్షలు తెలిపారు.