https://oktelugu.com/

ఆర్‌టిసి బస్సులపై రేపే కేసీఆర్ నిర్ణయం..

కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విషయమై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆర్ టి సి బస్సులను నడపడం, సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తెరవడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గత వారం నుండి కేంద్రం సూచనలమేరకు పలు సడలింపులు ఇచ్చారు. ఇప్పట్లో రైళ్లను నడపవద్దని కేసీఆర్ ప్రధాని నరేంద్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 14, 2020 / 12:26 PM IST
    Follow us on

    కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విషయమై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    ముఖ్యంగా ఆర్ టి సి బస్సులను నడపడం, సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తెరవడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గత వారం నుండి కేంద్రం సూచనలమేరకు పలు సడలింపులు ఇచ్చారు.

    ఇప్పట్లో రైళ్లను నడపవద్దని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కోరిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా కేంద్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండడం వల్ల తలెత్తున్న సమస్యలు, దీని వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులపై కూడా ఈ సమీక్షలో లోతుగా చర్చించనున్నారు.

    కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఇక దానితో కలిసి జీవించే అంశాలపై కూడా లోతుగా సమాలోచనలు చేయనున్నారు. గత 5న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మద్యం షాప్ లతో పాటు ఆర్‌టిఎ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వంటి ప్రభుత్వ కార్యాలయాలు సహితం తెలంగాణలో తెరుచుకున్నాయి.

    ఇదే తరహాల్లో ఆర్‌టిసి బస్సులను నడిపే విషయంలో కూడా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెండు మాసాలుగా పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ఆర్‌టిసిని ఆర్ధిక నష్టాల నుంచి గట్టెక్కించడానికి వీలైనంత త్వరగా బస్సులను నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

    అయితే ఈ బసులను నడపడం వల్ల కరోనా వైరస్‌ను ఏ మేరకు నియంత్రించేందుకు అవకాశముంటుంది? ఒకవేళ అనుమతులను ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తదితర అంశాలపై ఇప్పటికే సిఎం కెసిఆర్ రవాణా శాఖ అధికారులతో కూలంకషంగా చర్చించినట్లుగా చెబుతున్నారు.