Madhavilatha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిన చిత్రం ” పుష్ప”. సమంత నటించిన ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా దూసుకుపోతుది. ఇటివలే విడుదలైన ఈ ఐటెం సాంగ్‌కు ఎంతగా రెస్పాన్స్ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాలు వస్తున్నాయి. మగవారి మనోభవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!
ఈ పాటలో మగవాళ్లంతా చెడ్డవారు అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ పుష్ప టీంతో పాటు సమంతపై కేసు పెట్టారు ఏపీ పురుషుల సంఘం. దీనిపై మాధవిలత స్పందిస్తూ ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. “వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి.
సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతాను అని అన్నారు మాధవిలత. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా ఒక అమ్మాయికి మగాడిని చూస్తే అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా…
అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా.. ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది”. ప్రస్తుతం మాధవిలత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read: మరో సరికొత్త షోకు శ్రీకారం చుట్టిన ‘ఆహా’