https://oktelugu.com/

Hero Vikram: హీరో విక్రమ్​కు కరోనా పాజిటివ్​

Hero Vikram: తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. తెలుగు మలయాళం పలు చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షక అభిమానుల మెప్పు పొందారు. అపరిచితుడు సినిమా తో భారత దేశ వ్యాప్తంగా స్టార్ హీరో గా ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు. విక్ర‌మ్ నటిస్తున్న “కోబ్రా ” వచ్చే ఏడాది లో విడుదల కానుంది. అయితే తాజాగా విక్ర‌మ్ కు క‌రోనా పాజిటివ్ గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 08:46 PM IST
    Follow us on

    Hero Vikram: తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. తెలుగు మలయాళం పలు చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షక అభిమానుల మెప్పు పొందారు. అపరిచితుడు సినిమా తో భారత దేశ వ్యాప్తంగా స్టార్ హీరో గా ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు. విక్ర‌మ్ నటిస్తున్న “కోబ్రా ” వచ్చే ఏడాది లో విడుదల కానుంది. అయితే తాజాగా విక్ర‌మ్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

    Hero Vikram

    Also Read: శ్యామ్​సింగరాయ్​ సినిమాలో హైలైట్​గా నిలిచేది ఆ సీన్లేనట?​

    నేడు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లలో విక్ర‌మ్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.ఇది ఓమిక్రాన్ వేరియంట్ కాదా అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టు ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు అని సమాచారం. అయితే ఈ మ‌ధ్య కాలంలో త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారు క‌చ్చితంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విక్ర‌మ్ కోరారు.ఆయన ఇటివలే తన రాబోయే చిత్రం కోబ్రా షూటింగ్‌లో పాల్గొన్నారు.

    ఆ యూనిట్ బృందాన్ని కూడా క‌రోనా ప‌రీక్ష‌ చేయించుకోవాలని సూచించారు. మణిరత్నం దర్శకత్వంలో PS-I అనే హిస్టారికల్ నేపథ్యంలో విక్రమ్ ప్రధాన పాత్రలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రకాష్ రాజ్, కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలానే తమిళ యాక్షన్ హీరో అర్జున్ కుడా ఇటీవలే క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే.

    Also Read: కేజీఎఫ్​ చాప్టర్​2 నుంచి ఇంట్రెస్టింగ్​ బజ్​.. 3డీలో సినిమా రిలీజ్​?