https://oktelugu.com/

Hero Arya: “అంతఃపురం”సినిమాతో రానున్న హీరో ఆర్య… విడుదల ఎప్పుడంటే?

Hero Arya: హారర్ సినిమాలు అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొన్ని చిత్రాలు అనువాదం కూడా అయ్యాయి. వాటిలో లో విజయం అందుకున్న చిత్రం” అరణ్మనై”. 2014లో విడుదలైన హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం”అరణ్మనై”. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం అందుకోగా తెలుగులో “చంద్రకళ” అనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 08:59 PM IST
    Follow us on

    Hero Arya: హారర్ సినిమాలు అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొన్ని చిత్రాలు అనువాదం కూడా అయ్యాయి. వాటిలో లో విజయం అందుకున్న చిత్రం” అరణ్మనై”. 2014లో విడుదలైన హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం”అరణ్మనై”. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం అందుకోగా తెలుగులో “చంద్రకళ” అనే టైటిల్ తో డబ్బింగ్ చేశారు యూనిట్ బృందం.

    Hero Arya

    తెలుగులో కూడా విజయం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన ‘అరణ్మనై -2’ కూడా ‘కళావతి’ పేరుతో అనువాదమైన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ చిత్రానికి మూడోవ పార్ట్ తెరకెక్కించారు తమిళ దర్శకుడు సుందర్ సి. ఈ యేడాది అక్టోబర్ లో తమిళంలో విడుదలైన ‘అరణ్మనై -3’ సినిమా ‘అంతఃపురం’ పేరుతో డబ్ అవ్వడం విశేషం.

    Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!

    ఈ హారర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకులను నవ్విస్తూ ఒకవైపు ఉత్కంఠ సన్నివేశాలతో ఆధార్ ఇస్తుంది ఈ చిత్రం. ఆర్య,ఆండ్రియా మరియు రాశిఖన్నా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను డిసెంబర్ 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. కామెడీ స్టార్ యోగి బాబు,నళిని, మనోబాల, సంపత్ రాజ్,అగర్వాల్, స్వర్గీయ వివేక్, మైనా నందిని తదితరులు నటించారు.సుందర్ సి భార్య కుష్బూ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు.ఈ సినిమాకు సి. సత్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కూడా “చంద్రకళ” విషయం అందుకుంటుందో లేదో చూడాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.

    Also Read: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ