https://oktelugu.com/

Kangana Ranaut: కొత్త కారుని కొనడం కోసం ఇంటిని అమ్మేసిన ప్రభాస్ హీరోయిన్..ఇది మామూలు పిచ్చి కాదండోయ్!

ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్న ఆమె, ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన ఎంపీ ఎన్నికలలో బీజేపీ పార్టీ నుండి 'మంది' స్థానం లో పోటీ చేసి గెలుపొందింది. ఈ ఎన్నికలలో ఆమె దాదాపుగా 74 వేల ఓట్ల మెజారిటీ తో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి గెలిచింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 11:05 AM IST

    Kangana Ranaut

    Follow us on

    Kangana Ranaut: హీరోయిన్స్ క్యాటగిరీ లో పాన్ ఇండియన్ రేంజ్ లో సూపర్ స్టార్ ఇమేజి సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు కంగనా రనౌత్. ఈమె ప్రభాస్ హీరో గా నటించిన ‘ఏ నిరంజన్’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం. అప్పట్లో ఈమెను చూడగానే మన తెలుగు ఆడియన్స్ ఎవరీ రింగుల జుట్టు అమ్మాయి, ఇంత అందంగా ఉంది, పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్స్ ని భలే పట్టుకొస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికి ఈమె మన తెలుగు ఆడియన్స్ కి కొత్త ఏమో కానీ, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజి ని సంపాదించుకుంది. కేవలం హీరోల పక్కన డ్యాన్స్ వేసే హీరోయిన్ టైపు కాదు ఈమె, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు ఈ హాట్ బ్యూటీ సమాజం లో జరిగే అంశాలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటుంది.

    ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్న ఆమె, ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన ఎంపీ ఎన్నికలలో బీజేపీ పార్టీ నుండి ‘మంది’ స్థానం లో పోటీ చేసి గెలుపొందింది. ఈ ఎన్నికలలో ఆమె దాదాపుగా 74 వేల ఓట్ల మెజారిటీ తో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి గెలిచింది. అలా రాజకీయంగా మొదటి మెట్టులోనే విజయం అందుకున్న కంగనా రనౌత్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఈమె ఏమి చేసిన చాలా ప్రత్యేకంగాను, విభిన్నంగాను ఉంటుంది. లేటెస్ట్ గా ఈమె తన దగ్గరున్న 30 కోట్ల రూపాయిల ఖరీదైన ఇంటిని అమ్మేసింది. ఈ ఇంటిని అమ్మిన మారుసటి రోజునే ఆమె రేంజ్ రోవర్ లో లేటెస్ట్ వెర్షన్ కారుని కొనుగోలు చేసింది. దీని ఖరీదు దాదాపుగా 5 కోట్ల రూపాయిలు ఉంటుందట. రీసెంట్ గా ఆమె అమ్మిన ఇంటి డబ్బులతో కొంత ఖర్చు చేసి ఈ కారుని కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు.

    దీనిని చూసిన నెటిజెన్స్ ఈమెకి పిచ్చి పరాకాష్టకు చేరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కంగనా రనౌత్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు కూడా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆమె ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇందులో ఆమె ఇండియా గాంధీ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అచ్చు గుద్దినట్టు ఇందిరా గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయినట్టుగా అనిపించింది. అనేక కాంట్రవర్సీలకు తెరలేపిన ఈ చిత్రం విడుదల అతి త్వరలోనే జరగనుంది. తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారట.