Aravind Swamy : ఇండస్ట్రీలో కొందరు ఓ మెరుపు మెరిసి కనుమరుగు అవుతుంటారు. వారు సృష్టించిన అద్భుతాలను మర్చిపోకముందే ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కొందరు రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ హిట్లతో సునామీలు సృష్టించడానికి సిద్ధం అవుతుంటారు. కానీ ఒకసారి కనుమరుగు అయ్యాక వారి క్రెడిట్ పోతుంది అనుకోవడం తప్పే. వారు ఎంట్రీ ఇస్తే చాలు వారిని విజేతలుగా నిల్చోబెట్టడానికి ప్రేక్షకాభిమానులు సిద్దంగా ఉంటారు. ఇదంతా పక్కన పెడితే మీకు అరవింద్ స్వామి గుర్తున్నాడా? ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫేవరేట్ హీరో అరవింద్ స్వామి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అప్పట్లో రోజా, బొంబాయి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అంతేకాదు వరుస సినిమాలతో కెరీర్ లో మంచి ఫాం మీదున్న అరవింద్ స్వామి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమై అభిమానులు ఫుల్ బాధ పెట్టారు అనే చెప్పాలి. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. దీంతో అభిమానులు మళ్లీ ఖుషీ అవుతున్నారు. అప్పట్లో హీరోగా అలరించిన అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్ గా, సహయ నటుడిగా కనిపించి అభిమానులను మెప్పించడానికి సిద్దం అయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సత్యం సుందరం వంటి ఫీల్ గుడ్ మూవీతో మరోసారి పలకరించాడు.
కోలీవుడ్ హీరో కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన సినిమానే సత్యం సుందరం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. విడుదలై వారం దాటినా ఈ సినిమాకు ఆదరణ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈయన. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల రీజన్ చెప్పారు. డైరెక్టర్ మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ కూడా సాఫీగా సాగిపోతుందని తెలిపారు. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే తనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయట. దీంతో పలు చిత్రాలను చేయలేకపోయానని తెలిపారు.
వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకున్నానని.. ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డానని.. అదే సమయంలో కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చిందని అన్నారు. దీంతో దాదాపు 13 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్నాను అన్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదట. అయినా డైరెక్టర్ మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ ప్లాన్ లేకుండానే రీఎంట్రీ ఇచ్చాను అన్నారు. కడలి మూవీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక తన సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్ లో పాల్గొన్నానని.. సత్యం సుందరం మూవీ చాలా ఇష్టంతో చేశానని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు అడియన్స్ కూడా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.