Karthi Sathyam Sundharam : ఎన్టీయార్ ను తెలియకుండానే భారీ దెబ్బ కొట్టిన తమిళ్ స్టార్ హీరో…

ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొ దర్శకుడు వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరు ఏ సినిమా చేసిన కూడా అల్టిమేట్ గా సక్సెస్ మాత్రమే ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి దర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 4, 2024 9:41 pm

Karthi Sathyam Sundharam

Follow us on

Karthi Sathyam Sundharam :  తెలుగులో ఉన్న దర్శకులు చాలా మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొంతమంది మాత్రం రొటీన్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎవరు ఏ సినిమా చేసిన కూడా అల్టిమేట్ గా ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చితే తప్ప ఆ సినిమాలు సక్సెస్ తీరాలకైతే చేరడం లేదు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక వరుస సినిమాతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ సినిమాలకి ఒక సోషల్ మెసేజ్ ని జోడించి చెప్పడంలో సిద్ధహస్తుడు… ఈయన చేసిన మొదటి సినిమా ‘మిర్చి ‘ నుంచి ఇప్పుడు చేసిన ‘ దేవర ‘ సినిమా వరకు ప్రతిదాంట్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కార్తీ సత్యం సుందరం సినిమాని రిలీజ్ చేసి మంచి విజయాన్ని సాధించాడు. నిజానికి దేవర సినిమా కంటే కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

తెలుగులో ఈ సినిమా స్లో పాయిజన్ లా నెమ్మదిగా విస్తరిస్తూ ముందుకు సాగుతుంది. దీనివల్ల దేవర సినిమాకి కలెక్షన్ల పరంగా కూడా కొంతవరకు డ్యామేజ్ అయితే జరిగింది. అలా జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా వచ్చి కార్తీ తెలియకుండానే జూనియర్ ఎన్టీఆర్ ని డామినేట్ చేశాడనే చెప్పాలి. మరి మొత్తానికైతే ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక క్లాసికల్ మూవీ గా మిగిలిపోయిందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా కార్తీ వస్తున్నాడు. ఆయన సినిమా ఆడుతుందా లేదంటే ఎన్టీయార్ తాకిడి తట్టుకోలేక ఆ వరదలో కొట్టుకుపోతుందా అని అందరూ అనుకున్నారు. కానీ కంటెంట్ సినిమాలు ఎప్పుడూ ఆడతాయని నిరూపించిన సినిమా ‘సత్యం సుందరం’… ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కంటెంట్ లో దమ్ముంటే మాత్రం అది ఎంత చిన్న సినిమా అయినా కూడా ఆడుతుందని చెప్పడానికి ఈ సినిమాలను మనం ఇక ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఈ సినిమా దర్శకుడు అయిన ప్రేమ్ కుమార్ ఇంతకుముందు చేసిన 96 సినిమా కూడా ఒక ఫీల్ గుడ్ సినిమాగా ప్రేక్షకులందరిలో గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ సత్యం సుందరం సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడం అనేది ఇప్పుడు ఆయన టేస్ట్ ని మరోసారి ప్రేక్షకులందరికీ తెలియజేసిందనే చెప్పాలి…