మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీలో చిరంజీవితోపాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఆచార్య’ మూవీ ప్రారంభం అయినప్పటి నుంచి టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ నిలిచిపోయింది.
Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్ బాబు
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తొలిసారి ‘ఆచార్య’ మూవీ రాబోతుంది. కొరటాల శివ సినిమాలన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు మంచి మెసేజ్ ఓరియేంటెడ్ గా ఉంటాయి. చిరంజీవి సినిమాలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ రాబోతుండటంతో అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇచ్చాయి. దీంతో టాలీవుడ్లోనూ సినిమాల సందడి మొదలైంది. అయితే ‘ఆచార్య’ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేడ్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జూన్లోనే ‘ఆచార్య’ మూవీని ప్రారంభించాలని చిరు-కొరటాల టీమ్ భావించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో షూటింగును ప్రారంభించేందుకు చిత్రబృందం వెనుకడుగు వేసింది.
ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ‘ఆచార్య’ టీమ్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగు నవంబర్ రెండోవారం ప్రారంభించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ‘ఆచార్య’ టీమ్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ నిలిచిపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని భావించారు.
Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్
అయితే సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుండటంతో వచ్చే ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తుందట. ఇలా ‘ఆచార్య’ చిత్రం రోజురోజుకు ఆలస్యం అవుతుండటంపై మెగా అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు.