https://oktelugu.com/

‘రేణు దేశాయ్’ సక్సెస్ అయితే.. అకీరాని కూడా.. !

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి ‘రేణు దేశాయ్’ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సామాజిక స‌మ‌స్య‌ల‌ పై స్పందిస్తూ ఉంటుంది. కొన్ని విష‌యాల్లో తన ఆలోచనా విధానంతో మహిళలలకు యువతకు అవ‌గాహ‌న కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల పై జరిగే మానసిక దాడులను ఆమె తీవ్ర స్థాయిలో నిర‌సిస్తూ ఉంటుంది. ఓ దశలో తానూ అలాంటి దాడులను ఎదుర్కున్నాను అని.. తనని ఇబ్బంది పెట్టిన వారి పై విరుచుకుపడింది. త‌న అభిప్రాయాలను ఎలాంటి భ‌యం లేకుండా నేరుగా చెబుతూ […]

Written By:
  • admin
  • , Updated On : September 22, 2020 / 07:08 PM IST
    Follow us on


    పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి ‘రేణు దేశాయ్’ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సామాజిక స‌మ‌స్య‌ల‌ పై స్పందిస్తూ ఉంటుంది. కొన్ని విష‌యాల్లో తన ఆలోచనా విధానంతో మహిళలలకు యువతకు అవ‌గాహ‌న కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల పై జరిగే మానసిక దాడులను ఆమె తీవ్ర స్థాయిలో నిర‌సిస్తూ ఉంటుంది. ఓ దశలో తానూ అలాంటి దాడులను ఎదుర్కున్నాను అని.. తనని ఇబ్బంది పెట్టిన వారి పై విరుచుకుపడింది. త‌న అభిప్రాయాలను ఎలాంటి భ‌యం లేకుండా నేరుగా చెబుతూ మొత్తానికి తనలాంటి ఆడవారిని చైత‌న్య‌ప‌రిచే విధంగా తాను ఓ సినిమాను కూడా చేస్తానంటుంది.

    Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు

    ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ తప్పదు.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నేను నా రైతు సినిమా పనులతో బిజీగా ఉన్నాను. అయితే నేను నా తరువాత సినిమాలో ఆడవారి రక్షణకు సంబంధించిన అంశాల పై సినిమా చేద్దామనుకుంటున్నాను. మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు’ అనే కథాంశంతో ఆడవాళ్ళల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేయాలని ఉంది. అంటూ రేణు చెబుతుంది. ఇప్పటికే మరాఠీలో ‘రేణు దేశాయ్’ ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుందనేది అమె ప్లాన్ లా ఉంది.

    Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్

    కాబట్టి ఆమె తెలుగు సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ప్రస్తుతం రేణు దేశాయ్ తెరకెక్కించబోయే సినిమా కథ రైతు కథాంశంతో సాగుతుందని.. రైతుల స్థితిగతులు, జీవన విధానం పరిశోధించి మరీ రేణూ దేశాయ్ ఎన్నో విషయాలను రిసెర్చ్ చేసి.. ఆమె రైతు సినిమా తీస్తుందట. అన్నట్టు ఆమె ఈ రైతు సినిమాలో ఓ పాటను జానపద కళాకారుడు, గేయ రచయిత గోరేటి వెంకన్నతో రాయించింది. తన సినిమాలో రైతులు గురించి కనువింపు కలిగేలా కథ ఉంటుందని.. అందుకే ఆయన చేత పాట రాయించిందట. మరి దర్శకురాలిగా ‘రేణు దేశాయ్’ ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి. మరీ సక్సెస్ అయితే అకీరా మొదటి సినిమా కూడా ఆమె డైరెక్ట్ చేస్తోందేమో చూడాలి.