కథ చెప్పి.. విమర్శకుల నోటికి తాళంవేసిన సోనుసూద్

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం ఉన్నఫలంగా లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో ఎక్కడివారు అక్కడే రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోజు వారీ కూలీ చేసుకునే వారంతా చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిని గుర్తించిన కేంద్రం ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చింది. Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తమవంతు సాయంగా ఎంతోమంది సెలబ్రెటీలు కేంద్ర, రాష్ట్ర […]

Written By: NARESH, Updated On : September 22, 2020 8:17 pm
Follow us on


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం ఉన్నఫలంగా లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో ఎక్కడివారు అక్కడే రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోజు వారీ కూలీ చేసుకునే వారంతా చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిని గుర్తించిన కేంద్రం ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చింది.

Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు

లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తమవంతు సాయంగా ఎంతోమంది సెలబ్రెటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళాలను ప్రకటించారు.  మరికొందరు నేరుగా ప్రజలకు సాయం అందించేందుకు రంగంలోకి దిగారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనుసూద్ ముందుకొచ్చారు. లక్షలాది మంది వలస కార్మికులను తన సొంతడబ్బుతో బస్సుల్లో.. రైళ్లలో వారి స్వస్థలాలకు చేర్చి వార్తల్లో నిలిచారు.

అయితే కొందరు మాత్రం సోనుసూద్ రాజకీయాల్లో వచ్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఆయన ఏదో ఆశించే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యారు. తనపై వస్తున్న విమర్శలకు సోనుసూద్ ఒక కథను ఊదహరిస్తూ వాటికి చెక్ పెట్టాడు.

‘నేను చిన్నప్పుడు ఓ కథను విన్నాను. ఓ సాధువు వద్ద ఒక ఉత్తమ గుర్రం ఉండేది. దానిని తనకు ఇవ్వమని ఓ దొంగ అడుగగా.. సాధువు తిరస్కరిస్తాడు.. కొంతదూరం ప్రయాణించాక, నడవలేక నడుస్తున్న ఓ ముదుసలి సాధవు కన్పిస్తాడు. సాధువు జాలితో తన గుర్రాన్ని ఆ ముసలి వ్యక్తికి ఇస్తాడు.. అయితే గుర్రం మీద కూర్చున్న వెంటనే ఆ వ్యక్తి భయంకరంగా నవ్వుతూ.. తానే దొంగ అనే సంగతి చెబుతాడు. అప్పుడు సాధువు అతడిని ఆపి.. అతని గుర్రాన్ని తీసుకోవచ్చని, కానీ ఆవిధంగా తీసుకున్నట్లు ఎవరికీ చెప్పవద్దని చెబుతున్నాడు.

Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్

ఈ విషయం ప్రజలకు తెలిస్తే వారు అవసరంలో ఉన్నవారికి కూడా సాయం చేసేందుకు ముందుకురారని దొంగను కోరతాడు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదేనని.. మీ వృత్తిలో భాగంగా కొందరు(విమర్శకులు) విమర్శలు చేస్తుంటారని.. దీని వల్ల మీకు వేతనం లభిస్తుంది కాబట్టి చేయవచ్చు.. కానీ మీ మాటలు, చేతల ప్రభావం నాపై పడవు.. నేను నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాన’ని చెప్పాడు. ఒక్క కథతో సోనుసూద్ విమర్శకుల నోటికి తాళంవేయడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.