https://oktelugu.com/

Perni Nani: మెగాస్టార్ చిరంజీవి దేవుడే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం?

Perni Nani: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నేని నాని చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి గుణం మంచిదని అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయాల్లో ఇమడలేక సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. చిరంజీవికి పవన్ కల్యాణ్ కు బాగా తేడా ఉందని చెప్పడం గమనార్హం. మెగాస్టార్ అందరివాడని పవర్ స్టార్ కొందరి వాడని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మంచివాడని అందరి […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2022 / 12:28 PM IST
    Follow us on

    Perni Nani: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నేని నాని చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి గుణం మంచిదని అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయాల్లో ఇమడలేక సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. చిరంజీవికి పవన్ కల్యాణ్ కు బాగా తేడా ఉందని చెప్పడం గమనార్హం. మెగాస్టార్ అందరివాడని పవర్ స్టార్ కొందరి వాడని పేర్కొనడం తెలిసిందే.

    Perni Nani

    ఈ నేపథ్యంలో మెగాస్టార్ మంచివాడని అందరి బాగోగులు చూస్తారని ఆకాశానికెత్తారు కానీ పవన్ కల్యాణ్ అలా కాదని తన స్వార్థం కోసమే పని చేస్తారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమానికే పెద్దపీట వేస్తారని ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీనే అధికారంలో కొనసాగడం చూస్తామని జోస్యం చెప్పారు.

    Also Read: Mahesh Babu: ‘కేజీఎఫ్ 2’ మ‌హేష్ కు న‌చ్చ‌లేదా ? అందుకే మౌనంగా ఉన్నాడు ?

    ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా వాటిని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కంటున్నారని అవి కల్లలే అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదని ఒక వైసీపీనే ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీకి ప్రజలు ఎప్పుడు పట్టం కడతారని సూచిస్తున్నారు.

    పవన్ కల్యాణ్ వ్యక్తిత్తత్వంపై నాని కామెంట్లు చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీనిపై పవన్ కూడా ఘాటుగానే స్పందించనున్నారు. నాని వ్యక్తిగత విషయాలపై ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ కూడా నోరు విప్పితే రాద్ధాంతమే. చంద్రబాబు కోసం పని చేస్తున్నారని నాని ఆరోపణ. దీంతో రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎటు వైపు మొగ్గు చూపుతారనే దానిపైనే అందరి ఆసక్తి నెలకొంది.

    chiranjeevi, pawan kalyan

    బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ఏం సాధించారనే ప్రశ్న వేస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి సిద్ధమవుతున్నా పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బీజేపీతో అంటకాగి ఏం సాధించారో తెలియజేయాలని నాని డిమాండ్ చేస్తుండటంతో ఇక పవన్ కల్యాణ్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    Also Read:Bigg Boss Nonstop Telugu: క్లోజ్ ఫ్రెండ్స్ మ‌ధ్య వార్‌.. శివ‌ను నామినేట్ చేసిన బిందు.. ఒంట‌రిని చేస్తున్నారా..?
    Recommended Videos


    Tags