
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘ఆచార్య’ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి పుట్టిన రోజున ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 22న సాయంత్రం 4గంటలకు ఆచార్య మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. మోస్టర్ పోస్టర్ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.
Also Read: ఫ్యాన్స్‌కు పండగే.. రజినీ- కమల్ కాంబో ఫిక్స్..
చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ‘ఖైదీ-150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టు సాధించింది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల నర్సింహారెడ్డి జీవితాధరంగా తెరకెక్కిన ‘సైరా’ మూవీలో నటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఘన విజయం సాధించినా మిగతా భాషల్లో అనుకున్నంత విజయం సాధించలేదు.
ఈ మూవీ తర్వాత చిరంజీవి-కొరటాల కాంబినేషన్లో చిరంజీవి-152 మూవీ తెరకెక్కుతోంది. కమర్షియల్ హంగులతో మేసేజ్ ఓరియేంటేడ్ మూవీ తీయడంతో కొరటాల శివ దిట్టా. చిరు సినిమాలు కూడా మేసేజ్ ఓరియేంట్ గానే ఉంటాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రెజీనా ఓ ప్రత్యేక సాంగులో నటిస్తుంది. ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగు పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది.
Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి
ఆచార్య మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచారు. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో #Happy Birthday chiru ట్యాగులతో ట్వీటర్ ను హోరెత్తిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా చిరంజీవి కోసం ఓ ప్రత్యేక గిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇది కూడా చిరంజీవి పుట్టినన రోజున విడుదల కానుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.