దుబ్బాక బరిలో సీఎం కూతురు?

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలన్నీ ఢీలా పడిపోయాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన కారు జెడ్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. అయితే కరోనా ఎంట్రీతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువ చేయడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో కొంతమేర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచింది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తుందనే ప్రచారం […]

Written By: Neelambaram, Updated On : August 18, 2020 6:22 pm
Follow us on


టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలన్నీ ఢీలా పడిపోయాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన కారు జెడ్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. అయితే కరోనా ఎంట్రీతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువ చేయడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో కొంతమేర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచింది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తుందనే ప్రచారం జనాల్లోకి వెళ్లడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక మొదలైంది.

Also Read: వరదలో వరంగల్.. కారణమెంటీ?

కరోనా విజృంభిస్తున్న సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకస్మాత్తుగా మృతిచెందారు. దీంతో త్వరలోనే ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. దుబ్బాక టీఆర్ఎస్ కు కంచుకోట అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరు నిలుచున్నప్పటికీ కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇటీవల టీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోటీ చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ సైతం దుబ్బాకలో పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు.

దుబ్బాకలో పోటీ ఖాయమని తేలడంతో ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల విషయంలో తలమునకలవుతున్నాయి. 2009 ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి ముత్యం రెడ్డి గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన 2014, 2018ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి వరుసగా విజయం సాధించారు. రెండుసార్లు కూడా పార్టీ అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ దుబ్బాకలో బలమైన శక్తిగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో ఆశావహులు టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు.

గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన అకాల మృతిచెందాడు. తాజాగా రామలింగారెడ్డి మృతిచెందాడంతో టీఆర్ఎస్ లో పెద్దదిక్కు లేకుండా పోయాడు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రజల్లో ఏమేరకు ఉందో ఈ ఎన్నిక ద్వారా తేలనుండటంతో రెండు పార్టీలు కూడా పోటీ సై అంటున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఓడిన దాఖలాలు లేవు. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలను బుద్దిచెప్పాలని ఆ పార్టీ భావిస్తోంది.

Also Read: కీసర ఎమ్మార్వో కేసులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల టార్గెట్ రేవంతేనా?

దీంతో టీఆర్ఎస్ నుంచి సీఎం కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో అనుహ్యంగా కవిత ఓటమిపాలయ్యారు. కాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కవిత పోటీలో ఉన్నారు. కరోనా కారణంగా ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఆమెను కవితను దుబ్బాక నుంచి పోటీ చేయిస్తే మెదక్ తోపాటు సంగారెడ్డిలోనూ టీఆర్ఎస్ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తుంది.

ఎమ్మెల్సీ బరిలో ఉన్న కవితను దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలిపేందుకు సీఎం కేసీఆర్ మొగ్గుచూపక పోవచ్చనే టాక్ విన్పిస్తోంది. ఒకవేళ కవిత బరిలో లేకుంటే ఎవరు నిలబడుతారనే చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ బలంగా ఉండటం.. సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ నుంచి ఎవరు నిలిచినా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.