Abhishek
Abhishek : బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమం లో తమదైన రీతిలో సత్తా చాటుతూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క నటుడు తనను తాను స్టార్ హీరోలుగా మార్చుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ లాంటి హీరో సైతం ఇప్పుడు భారీ విజయాలను అందుకుంటున్నాడు. ‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన రీసెంట్ గా ఒక అవార్డుల ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇక ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అర్జున్ కపూర్ సైతం కొన్ని ఫన్నీ కామెంట్లైతే చేశాడు…ఇక ఈ సందర్భంలోనే అర్జున్ కపూర్ అభిషేక్ తో మీకు ఎవరి దగ్గరి నుంచి ఫోన్ వస్తే కంగారు పడిపోతారు అని అడగగా, దానికి అభిషేక్ సమాధానం ఇస్తు మా వైఫ్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తను మీతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు నాకు కంగారుగా ఉంటుంది అని చెప్పాడు. దాంతో ఆ ఈవెంట్ లో ఉన్న అందరూ నవ్వుకున్నారు…అలాగే అభిషేక్ బచ్చన్ అర్జున్ కపూర్ ను ఉద్దేశించి నీకు పెళ్లి అవ్వలేదు కాబట్టి కామెడీగా ఉంది. పెళ్లి అయితే ఆ భాద ఏంటో నీకు తెలుస్తోంది అంటు ఫన్నీ కామెంట్స్ చేశాడు…ఇక ఈ ఈవెంట్లోనే ఆయన మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావడానికి దర్శకుడు సుజీత్ సర్కార్ కారణమని ఆయన నన్ను ఈ క్యారెక్టర్ లో తీసుకోవడం వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు…
Also Read : నా భార్య ఏం చెప్పినా వింటా’.. విడాకుల పుకార్ల మధ్య అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని రోజుల నుంచి అభిషేక్ బచ్చన్ ఐశర్య రాయ్ ఇద్దరు విడిపోబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమం లో అభిషేక్ బచ్చన్ పరోక్షంగా ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడటం చూసిన ప్రతి ఒక్కరూ వీళ్ళ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వీళ్ళ మీద వచ్చిన వార్తలన్ని పుకార్లు అంటూ కొట్టి పడేస్తున్నారు.
వీళ్ళకి పెళ్ళై 17 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. వీళ్లిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఐశ్వర్య రాయ్ అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.
ప్రస్తుతం మంచి క్యారెక్టర్ దొరికితే ఇప్పుడు కూడా తను నటించడానికి సిద్దం గా ఉన్నానని ఆమె చాలా సందర్భాల్లో తెలియజేసింది… చూడాలి మరి ఇక మీదటైన ఆమె నటించే మంచి క్యారెక్టర్ దొరుకుతుందా లేదా అనేది…
Also Read : కూతురు పుట్టినరోజు వేడుకలకు దూరంగా అభిషేక్ బచ్చన్..మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్!