Donald Trump , Sunita Williams
Donald Trump and Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunitha Willams), బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుని, సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. 8 రోజుల పర్యటన కోసం వెళ్లిన వీరు, అనుకోకుండా 9 నెలలు అక్కడే గడిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రత్యేక చొరవతో ఇద్దరినీ తీసుకువచ్చారు. ఇందులో ఎలాన్ మస్క్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ట్రంప్ మరోమారు తన ఉదారత చాటుకున్నారు.
సునీత విలియమ్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చూపిన ఆసక్తి మరియు సానుభూతిని చాలా మంది ‘గొప్ప మనసు‘గా అభివర్ణిస్తున్నారు. 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్(Star Liner)లో 8 రోజుల మిషన్ కోసం బయలుదేరిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్(Buch Willmore), సాంకేతిక లోపాల కారణంగా అంతరిక్షంలో 9 నెలలకు పైగా చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని ట్రంప్ తనదైన శైలిలో హైలైట్ చేశారు. 2025 మార్చిలో ఓవల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతూ, ‘మేము మిమ్మల్ని తీసుకురాబోతున్నాం, మీరు అక్కడ ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు‘ అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జో బైడెన్ పరిపాలనపై విమర్శలు చేస్తూ, వారిని ‘వదిలేసినట్లు‘ ఆరోపించారు.
Also Read : ట్రంప్‌కు కోర్టు షాక్: భారతీయ రీసెర్చర్ బహిష్కరణపై కీలక ఆదేశాలు!
ఎలాన్ మస్క్‌కు అధికారం..
ట్రంప్ తన ప్రసంగంలో సునీత విలియమ్స్ గురించి ‘వైల్డ్ హెయిర్ ఉన్న మహిళ‘ అని సరదాగా పేర్కొన్నప్పటికీ, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ఎలాన్ మస్క్‌ను అధికారం ఇచ్చినట్లు చెప్పారు. ‘నేను ఎలాన్‌ను ఒక వారం క్రితం అడిగాను, వారిని తీసుకురాగలవా అని, అతను ’అవును’ అన్నాడు‘ అని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సునీత. బుచ్ పట్ల ఆయనకున్న శ్రద్ధను చూపిస్తాయని అనేక మంది భావించారు. చివరికి, స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్(Space X Dragan Capsule) ద్వారా మార్చి 19–20, 2025న వారు భూమికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వైట్ హౌస్(White House) ‘ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్‘ అని ప్రకటించింది, ట్రంప్ హామీని నెరవేర్చినట్లు సూచించింది. కొందరు ట్రంప్ ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని విమర్శించినప్పటికీ, చాలా మంది ఆయన చూపిన చొరవ, వారిని సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి పెట్టడాన్ని ప్రశంసించారు. ఈ సంఘటన సునీత విలియమ్స్‌కు ఆయన చూపిన గౌరవంగా చాలా మంది చూస్తున్నారు.
ఓవర్‌టైంపై చర్చ..
ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపి భూమిపైకి వచ్చిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయం అదనపు వేతనం ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఓవర్‌టైం జీతాన్ని తాను స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్, ‘నేను చెల్లించాల్సి వస్తే, నా జేబు నుంచే వారికి ఓవర్‌టైం ఇస్తా. వీరిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చిన ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు. ఆయన లేకపోతే ఏమయ్యేదో ఆలోచించండి‘ అని మరోమారు తన ఉదారత చాటుకున్నారు.
ఓవర్‌టైం వేతనం ఎంతంటే..
నాసా నిపుణుల ప్రకారం, అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు సాధారణంగా అదనపు చెల్లింపులు ఉండవు. వీరు ఫెడరల్ ఉద్యోగులుగా, భూమిపై సాధారణ పర్యటనలా భావిస్తారు. జీతంతో పాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుంది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో రోజుకు 5 డాలర్ల చొప్పున అదనంగా చెల్లిస్తారు. సునీత, విల్మోర్ 286 రోజులు అక్కడ ఉన్నందున, వారికి 1,430 డాలర్లు అదనంగా వస్తాయి. నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ జీత గ్రేడ్‌ల ప్రకారం చెల్లింపులు పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ (జీఎస్–13 నుంచి జీఎస్–15) కింద వేతనం ఉంటుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గరిష్ట గ్రేడ్ జీఎస్–15 కింద ఉన్నారు. గత ఏడాది వీరి వార్షిక జీతం 1,52,000 డాలర్లుగా ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, నాసా నిబంధనల ప్రకారం అదనపు వేతనం పరిమితంగానే ఉంటుంది.
Also Read : సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ మోదీ ట్వీట్ వైరల్!