Aay Movie Collections : నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మరియు తంగలాన్ వంటి క్రేజీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాల్లో తంగలాన్ చిత్రానికి మంచి పాజిటివ్ రివ్యూస్ రాగా, మిగిలిన రెండు చిత్రాలకు నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ వీటితో పాటు ‘ఆయ్’ అనే చిన్న సినిమా కూడా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరో గా నటించిన రెండవ సినిమా ఇది. గీత ఆర్ట్స్ సమర్పణ బన్నీ వాసు ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసారు. అయినప్పటికీ కూడా పెద్ద హీరోల సినిమాలు ఉండడం వల్ల ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.
కానీ విడుదల తర్వాత ఆ సినెమాలన్నిటికంటే మంచి పాజిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీస్ నుండి అన్నీ ప్రాంతాలలో సినిమా పికప్ అయ్యింది. సాయంత్రం నుండి షోస్ సంఖ్య కూడా బాగా పెరిగింది. రేపటి నుండి ఈ చిత్రానికి అదనపు థియేటర్స్ కూడా వేస్తున్నారు. అలా సైలెంట్ గా వచ్చిన ఈ చిన్న సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో సంచలనాత్మక విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి బన్నీ వాసుకి కేవలం కోటి రూపాయిలు మాత్రమే ఖర్చు అయ్యిందట. కానీ మొదటి రోజే ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలకు కలిపి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని ట్రేడ్ పండితులు లేటెస్ట్ గా అందిస్తున్న సమాచారం. అంటే పెట్టిన డబ్బులో 75 శాతం మొదటి రోజే రికవర్ అయ్యిందన్నమాట. ఇంత సక్సెస్ ఫుల్ చిత్రం ఈ ఏడాది లోనే ఇప్పటి వరకు రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే జోరుని ఈ చిత్రం వీకెండ్ వరకు కొనసాగితే, కేవలం వీకెండ్ లోనే మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే నిర్మాత పెట్టిన డబ్బులకు మూడింతలు లాభం వచ్చినట్టు అన్నమాట. నిర్మాతగా బన్నీ వాసు కి ఇది జాక్ పాట్ అనే చెప్పాలి.
అలాగే హీరో నార్నే నితిన్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంది. మొదటి రెండు సినిమాలు ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. యువతకి బాగా కనెక్ట్ అయ్యే కథలనే ఆయన ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇదే ఊపుని కొనసాగిస్తే భవిష్యత్తులో ఆయన మరో క్రేజీ యంగ్ హీరో గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నితిన్ చేసిన రెండు సినిమాల్లో ఆయన నటనకంటే ఆయన పక్కన నటించిన వాళ్ళే ఎక్కువగా హైలైట్ అయ్యారు. అలా కాకుండా సోలో హీరో గా సినిమాలు తీసి హిట్ కొడితే పైకి ఎదిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.