https://oktelugu.com/

అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం

కరోనా వైరస్‌ సాధారణ ప్రజల్నే కాదు సెలబ్రెటీలను కూడా హడలెత్తిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా వారి ఇళ్లకు చేరిపోతోంది. ముఖ్యంగా ముంబైలో ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. ఆ మహానగరం కేంద్రంగా ఉన్న బాలీవుడ్‌కు ఇప్పటికే కరోనా సెగ తలిగింది. పలువురు సినీ సెలెబ్రిటీలు వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో ఈ ప్రాణంతక వైరస్‌ కలకలం సృష్టించింది. ఆమిర్ వద్ద పని చేస్తున్న సిబ్బందిలో కొందరికి కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2020 / 05:35 PM IST
    Follow us on


    కరోనా వైరస్‌ సాధారణ ప్రజల్నే కాదు సెలబ్రెటీలను కూడా హడలెత్తిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా వారి ఇళ్లకు చేరిపోతోంది. ముఖ్యంగా ముంబైలో ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. ఆ మహానగరం కేంద్రంగా ఉన్న బాలీవుడ్‌కు ఇప్పటికే కరోనా సెగ తలిగింది. పలువురు సినీ సెలెబ్రిటీలు వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో ఈ ప్రాణంతక వైరస్‌ కలకలం సృష్టించింది. ఆమిర్ వద్ద పని చేస్తున్న సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దాంతో, ఆమిర్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అమీర్కు కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన బాలీవుడ్‌ విలక్షణ నటుడు తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. కుటుంబ సభ్యులందరికీ టెస్టులు చేయించగా నెగిటివ్‌ ఫలితం వచ్చిందన్నాడు. తన తల్లికి మాత్రం ఇంకా పరీక్షలు జరగలేదని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా ఓ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశాడు.

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

    ‘నా స్టాఫ్ లో కొందరు కరోనా బారిన పడ్డారని తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో, అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్ కు వైద్య సదుపాయాలను కల్పించిన బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కి ధన్యవాదాలు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్యూమిగేషన్, స్టెరిలైజ్ చేశారు.

    మాలో మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. ఇప్పుడు మా అమ్మను పరీక్షకు తీసుకెళ్తున్నా. మాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆమే చివరి వ్యక్తి. ఆమెకు నెగెటివ్ రావాలని దయచేసి ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఈ సందర్భంగా కోకిలాబెన్ ఆసుపత్రికి కూడా ధన్యవాదాలు. అక్కడి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. టెస్టింగ్ విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా, ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు. గాడ్ బ్లెస్ అండ్ స్టే సేఫ్‌. ప్రేమతో మీ అమీర్’ అని అమీర్ ట్వీట్ చేశాడు.

    తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

    కాగా, అమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీలో నటిస్తున్నాడు. టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ దర్శకుడు అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమిర్ భార్య కిరణ్ రావు నిర్మిస్తున్న ఈ మూవీని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

    https://twitter.com/aamir_khan/status/1277850257653555205