కృష్ణ అండ్‌ హిజ్‌ లీల.. నెట్‌ఫ్లిక్స్‌కు బాయ్‌కాట్‌ సెగ

లాక్‌డౌన్‌ దెబ్బకు థియేటర్లు మూత పడడంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటిదాకా థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీకి రైట్స్‌ అమ్ముకున్న నిర్మాతలు.. ఇప్పుడు చిన్న సినిమాలను నేరుగా ఓటీటీలకే ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. పెరేవు రవికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిద్ధు, షాలినీ, శ్రద్ధ […]

Written By: Neelambaram, Updated On : June 30, 2020 5:50 pm
Follow us on


లాక్‌డౌన్‌ దెబ్బకు థియేటర్లు మూత పడడంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటిదాకా థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీకి రైట్స్‌ అమ్ముకున్న నిర్మాతలు.. ఇప్పుడు చిన్న సినిమాలను నేరుగా ఓటీటీలకే ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. పెరేవు రవికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిద్ధు, షాలినీ, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ, అంతకంటే ఎక్కువగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ మూవీకి హిందూవాదం సెగ తగిలింది. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే యువకుడు అనేక మంది అమ్మాయిలతో శారీర‌క సంబంధాలు పెట్టుకోవ‌డంపై హిందుత్వ వాదులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. పైగా దేవ‌త పేరు పెట్టుకున్న రాధ‌ అనే క్యారెక్టర్ను కూడా బాధితురాలిగా చూపించార‌ని ఆగ్రహిస్తున్నారు. ఈ మూవీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వుందని, దీన్ని వెంటనే బాయ్ కాట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన నెట్‌ఫ్లిక్స్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ట్విట్టర్లో ‘బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

నెట్ ఫ్లిక్స్ లో అభ్యంతరకరమైన దృశ్యాలున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్నాయని గతంలోనే ఆరోపణలు వచ్చిన వచ్చాయి. సాక్ర్డ్‌ గేమ్స్‌, లైలా, ఘౌల్‌, ఢిల్లీ క్రైమ్ వంటి ప‌లు వెబ్ సిరీస్‌లూ కూడా హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో కూడా అలాంటి సన్నివేశాలు ఉండడంతో నెట్ ఫ్లిక్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతిని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఎటువంటి చిత్రాలను, షో స్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై చిత్రం బృందం, నెట్‌ఫ్లిక్స్‌ స్పందిస్తాయో లేదో చూడాలి.