https://oktelugu.com/

Aadipurush 2nd Day Collections : 2 రోజుల్లో 240 కోట్లు.. మరో హీరో దరిదాపుల్లో లేడు..నెగటివ్ టాక్ తో ఇదేమి అరాచకం సామీ!

చూస్తూ ఉంటే కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా లేవు, ముఖ్యంగా మెట్రో సిటీస్ లో ఈ చిత్రానికి సాలిడ్ లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి వసూళ్ల రేంజ్  ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Written By:
  • Vicky
  • , Updated On : June 18, 2023 / 03:37 PM IST
    Follow us on

    Aadipurush 2nd Day Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ టాక్ పెద్దగా రాకపోయినా కూడా ఈ సినిమాకి వసూళ్లు మాత్రం ఇండస్ట్రీ హిట్ సినిమాకి వచ్చిన రేంజ్ లో వస్తున్నాయి. మొదటి రోజే 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

    సినిమాకి విడుదలకు ముందు భారీ హైప్ ఉండడం వల్ల, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ వసూళ్లు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ రెండవ రోజు కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గకుండా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు కంటే కూడా హిందీ లో ఈ చిత్రం కలెక్షన్ల సునామి ని సృష్టిస్తుంది. ఈ ఏడాది పఠాన్ చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక సినిమాగా ‘ఆదిపురుష్’ నిల్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    రెండవ రోజు కూడా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ గ్రాస్ వసూళ్లు వచ్చిందని.అలా రెండు రోజులకు కలిపి ఈ సినిమా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అయితే ఇదంతా ఫేక్ అని, కేవలం ప్రొమోషన్స్ కోసం నిర్మాతలు చేస్తున్న జిమ్మిక్కు అని, సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

    దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో సమాధానం చెప్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా సోమవారం రోజు కూడా హైదరాబాద్ వంటి సిటీలలో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. చూస్తూ ఉంటే కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా లేవు, ముఖ్యంగా మెట్రో సిటీస్ లో ఈ చిత్రానికి సాలిడ్ లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి వసూళ్ల రేంజ్  ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.