Aadipurush : ఆదిపురుష్ పై అపనిందలు ఎంతవరకు సమంజసం?

ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా దర్శకుడు ఓ విజన్ తో తీశారు. పాత్రల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పిల్లలకు ఇష్టంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం చేశారు.

Written By: Srinivas, Updated On : June 18, 2023 3:46 pm

Trolls On Adipurush

Follow us on

Aadipurush : రామాయణం నిజమైతే అద్భుతం. అబద్దమైతే మహాద్భుతం అంటారు. రామాయణంలో అన్ని అంశాలుంటాయి. మన కుటుంబానికి కావాల్సిన విలువలు ఎన్నో అందులో దాగి ఉన్నాయి. వాల్మీకి రాసిన రామాయణం ఎంతో అద్భుతమైన కావ్యం. ప్రతి విషయానికి ఉదాహరణలు చెబుతుంటాం. అందులో రామాయణం నుంచే ఎక్కువ అంశాలు వస్తాయి. రామాయణం మన హిందుత్వానికి ప్రతీక. మన నైతిక విలువలు ఎలా ఉండాలో చాటిచెప్పేదే ఈ గ్రంథం.

అంతరార్థం

రామాయణాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు మలుచుకున్నా చివరి అంతరార్థం ఒకటే. దాన్ని అభాసుపాలు చేయకపోవడమే. ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా  తెరకెక్కిన రామాయణ గాథ ఆదిపురుష్ గురించి చాలా విమర్శలు వస్తున్నాయి. సినిమా విషయంలో విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. వారికి నచ్చిన విధంగా వారు తెరకెక్కించారు.

కాంచన సీత

1977-78 సంవత్సరంలో మలయాళ దర్శకుడు అరవిందన్ కాంచన సీత అనే ఆదివాసీ రామాయణాన్ని తీశారు. అప్పట్లో అది సంచలనం కలిగించింది. జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. అలా ఆదిపురుష్ కూడా ఓ ఆలోచనతో తీశారు. కానీ రామాయణాన్ని కించపరచాలనే ఉద్దేశంతో కాదనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రయోగం చేస్తే దాని విలువ మారిపోదు. దాని ఒరిజినాలిటీ దెబ్బతినదు. రామాయణం గురించి అందరికి తెలుసు. అంత మాత్రాన ఏదో జరిగినట్లు నిందలు వేయడం సరికాదు.

విమర్శలు సరికావు

ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా దర్శకుడు ఓ విజన్ తో తీశారు. పాత్రల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పిల్లలకు ఇష్టంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం చేశారు. పెద్దల్లో విమర్శలు వస్తున్నా పిల్లలు మాత్రం ఇష్టంగా చూస్తున్నారు. ఆదిపురుష్ లో సాంకేతికత బాగా వాడారు. అందుకే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడం సబబు కాదనే వాదనలు కూడా వస్తున్నాయి.