https://oktelugu.com/

Diabetics: షుగర్ ఉన్నవారు పండ్లు తినవచ్చా?

టిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో 100 మిలియన్లకు పైగా షుగర్ పేషెంట్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే 136 మిలియన్ల మందికి మధుమేహం వ్యాపించినట్లు చెబుతున్నారు. ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, జీవన శైలి వంటి వాటి వల్ల షుగర్ వ్యాధి పెరుగుతోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2023 2:52 pm
    Follow us on

    Diabetics :  ఈ రోజుల్లో డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో 100 మిలియన్లకు పైగా షుగర్ పేషెంట్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే 136 మిలియన్ల మందికి మధుమేహం వ్యాపించినట్లు చెబుతున్నారు. ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, జీవన శైలి వంటి వాటి వల్ల షుగర్ వ్యాధి పెరుగుతోంది. చక్కెర వస్తే వారు ఏం తినకూడదు? ఏం తినవచ్చో తెలుసుకుని మరీ తింటుంటారు. పండ్లు ఎక్కువగా తింటే మంచి ఫలితాలు ఉంటాయని తెలిసినా పండ్ల జోలికి వెళ్లరు.

    డయాబెటిస్ వారు ఏ పండ్లు తినొచ్చు?

    డయాబెటిస్ వారు కూడా పండ్లు తినొచ్చు. కానీ అవి తియ్యగా ఉన్నవి కాకుండా మిగతావి తినొచ్చు. అరటి, మామిడి, సపోట, సీతాఫలం వంటి తియ్యగా ఉండే పండ్లను తినొద్దు. అందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. జామ, బొప్పాయి, ఆపిల్, నల్ల ద్రాక్ష, అవకాడో, దానిమ్మ వంటి పండ్లు తీసుకోవచ్చు. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు.

    అసలు పండ్లు తినకూడదా?

    డయాబెటిక్ పేషెంట్లు అసలు పండ్లు తినకూడదని చెబుతారు. ఇది అపోహే. నిరభ్యంతరంగా షుగర్ పేషెంట్లు కూడా పండ్లు తినొచ్చు. పండ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పండ్ల రసాలు, సలాడ్లు కూడా తీసుకోవచ్చు. పండ్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇలా పండ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు వస్తాయి.

    పండ్లు చక్కెరను పెంచుతాయా?

    పండ్లలో ప్రక్టోజ్ ఉంటుంది. ఇవి కాలేయానికి మంచిది. లివర్ లో గ్లూకోజ్ గా మార్చబడుతుంది. పండ్లలో ఫైబర్ ఉండటం వల్ల కార్బోహైడ్రేడ్లు శోషణ రాకుండా చేస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల పండ్లు తినడం శ్రేయస్కరం. పండ్లు తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. పండ్ల వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.